Share News

ఔను.. ఇరాన్‌పై దాడి చేశాము.. అంగీకరించిన ట్రంప్

ABN , Publish Date - Nov 03 , 2026 | 10:19 PM

ఇటీవల ఇరాన్‌కు చెందిన కెషమ్‌ ద్వీపంపై దాడి చేసింది తామేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అంగీకరించారు.

ఔను.. ఇరాన్‌పై దాడి చేశాము.. అంగీకరించిన ట్రంప్
Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ఇరాన్‌కు చెందిన కెషమ్‌ ద్వీపంపై దాడి చేసింది తామేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అంగీకరించారు. హోర్ముజ్‌లోని కెషమ్‌పై అమెరికా మిలిటరీ స్వల్ప స్థాయి దాడి చేసిందని చెప్పారు. ‘అక్కడ వారు గగనతల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాని నిర్మాణం పూర్తి కాగానే గత రాత్రి మేము దాడి చేశాము’ అని ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్‌ షోలో ట్రంప్ చెప్పారు. మిడ్‌టర్మ్ ఎన్నికల తరువాత కూడా దాడులు ఉంటాయా? అన్న ప్రశ్నకు కూడా ట్రంప్ బదులిచ్చారు. ‘అలాంటి ఉద్దేశమైతే ప్రస్తుతం లేదు గానీ అవసరమైతే దాడి చేస్తాము’ అని అన్నారు.


కెషమ్ ద్వీపంపై గత రాత్రి ఈ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ సీక్రెట్ దాడి గురించి తొలిసారిగా వాల్‌ స్ట్రీట్ జర్నల్ పత్రిక బయటపెట్టింది. పరిమిత స్థాయిలో దాడి జరిగిందని పేర్కొంది. స్వీయ రక్షణలో భాగంగా ఈ దాడి చేశామని యూఎస్ అధికారులు ఆ తరువాత చెప్పారు. ఇరాన్ దాడులకు దిగకుండా ముందు జాగ్రత్త తీసుకున్నామని అన్నారు. కెషమ్ ద్వీపంపై వరుసగా ఐదు సార్లు పేలుళ్లు సంభవించాయని ఇరాన్ మీడియా పేర్కొంది. కెషమ్ గగనతలంపై రెండు యుద్ధ విమానాలు తక్కువ ఎత్తులో ఎగరడాన్ని చూశామని స్థానికులు కొందరు చెప్పుకొచ్చారు. ఇక ఇజ్రాయెల్‌కు 3.8 బిలియన్ డాలర్ల వార్షిక మిలిటరీ సాయాన్ని కూడా వచ్చే ఏడాది నుంచీ నిలిపివేస్తున్నట్టు ట్రంప్ చెప్పారు. ఇందుకు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా సుముఖంగానే ఉన్నారని చెప్పారు. పదేళ్ల పాటు ఈ సాయం కొనసాగేలా ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పందం గడువు 2028లో ముగియనుంది.


ఈ వార్తలనూ చదవండీ:

ఇజ్రాయెల్‌కు ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తాము: ట్రంప్

అమెరికా ఎన్నికల్లో నిధుల వరద.. చరిత్రలో తొలిసారిగా..

Updated Date - Nov 03 , 2026 | 10:36 PM