ఎక్స్‌లో లైక్ బటన్ నొక్కు.. డాలర్ పంపు.. కొత్త ఫీచర్‌పై మస్క్ ప్రకటన
ABN , Publish Date - Oct 25 , 2026 | 01:38 PM
సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. పోస్టులకు లైక్ చేయడంతోపాటు వాటిని ప్రచురించిన వారికి నేరుగా డబ్బులు పంపే సదుపాయాన్ని తీసుకురావాలని ఎక్స్ యోచిస్తోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఓనర్ ఎలాన్ మస్క్ ఈనెల 25న ఎక్స్‌లో ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. పోస్టులకు లైక్ చేయడంతోపాటు వాటిని ప్రచురించిన వారికి నేరుగా డబ్బులు పంపే సదుపాయాన్ని తీసుకురావాలని ఎక్స్ యోచిస్తోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఓనర్ ఎలాన్ మస్క్ ఈనెల 25న ఎక్స్‌లో ప్రకటించారు. లైక్ బటన్‌ను కొంతసేపు నొక్కడం (లాంగ్ ప్రెస్) ద్వారా సంబంధిత పోస్టు చేసిన వారికి ఒక డాలర్ పంపివచ్చని ఆయన తెలిపారు. ఈ కొత్త సదుపాయం అందుబాటులోకి వస్తే కంటెంట్ క్రియేటర్లకు టిప్స్ ఇవ్వడం, నచ్చిన పోస్టులను ప్రచురించిన వారికి ఆర్థికంగా మద్దతు అందించడం వంటివి చేయవచ్చు. ప్రస్తుతం యూజర్లు పోస్టులకు లైక్ చేయడం, కామెంట్లు పెట్టడం, షేర్ చేయడం ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఫీచర్‌తో నేరుగా డబ్బులు పంపే అవకాశం కూడా అందుబాటులోకి రానుంది. లైక్ బటన్‌నే చెల్లింపుల కోసం ఉపయోగించడం ఈ ఫీచర్ ప్రత్యేకత.
1 డాలర్ టిప్ ఎలా పనిచేస్తుందంటే..
అమెరికాలో ఎక్స్ మనీ సేవలు ఇప్పటికే అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ సేవల ద్వారా వినియోగదారులు ఒకరి నుంచి మరొకరికి నగదు బదిలీ చేసుకోవచ్చు. దీనితో పాటు ఎక్స్ వీసా డెబిట్ కార్డు ద్వారా ప్రత్యక్షంగా డిజిటల్ రూపంలోనూ చెల్లింపులు చేయవచ్చు. అయితే, ఈ సేవలను వినియోగించుకోవాలంటే కొన్ని అర్హత ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. ఎక్స్ మనీ ద్వారా పోస్టుకు లైక్ ఇచ్చే సమయంలో సాధారణ లైక్ బటన్‌ను కొద్దిసేపు నొక్కి ఉంచితే, ఆ పోస్టు చేసిన వారికి ఒక డాలర్ పంపే సదుపాయాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. అయితే, ఈ ఫీచర్ ఎప్పటి నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది, ఎవరెవరు దీనిని వాడుకోవచ్చు అనే అంశాలపై ఎక్స్ ఇంకా పూర్తి వివరాలను వెల్లడించలేదు. ప్రస్తుతం ఎక్స్ మనీ అమెరికాకే పరిమితమైంది. భారత్‌లో ఈ సేవలను ఎప్పుడు ప్రారంభించనున్నారనే విషయంపై సంస్థ అధికారిక ప్రకటన చేయలేదు.
ఈ వార్తలు కూడా చదవండి ..
పాక్ వల్లే కశ్మీరీలకు రక్షణ.. ఫరూక్ అబ్దుల్లా
ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అమిత్ షా, సీఎం రేఖా గుప్తా.. శాంతిభద్రతలపై సమీక్ష