Share News

ఈ ఆహారం తిన్నారంటే ఫుల్ ఎనర్జీ..

ABN , Publish Date - Jan 31 , 2026 | 01:57 PM

ఎనర్జీ లెవెల్స్‌ను పెంచుకోవాలనుకుంటే.. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి మీరు తీసుకోవాల్సిన ఆహారం ఎంటో ఇప్పుడు చూద్దాం..

ఈ ఆహారం తిన్నారంటే ఫుల్ ఎనర్జీ..
Foods to Boost Energy,

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఒక్కరూ శరీరం దృఢంగా, ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా ఉండాలని కోరుకుంటారు. కానీ, ఈ బిజీ లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు, పొల్యూషన్ కారణంగా శరీరం చాలా బలహీనపడుతుంది. చాలా మంది మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, ఎక్కువ సేపు ఏదైనా పని చేసినప్పుడు త్వరగా అలసిపోతుంటారు. శరీరం త్వరగా అలసిపోకుండా రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


1. తృణధాన్యాలు:

బ్రౌన్ రైస్, రాగులు, ఓట్స్, జొన్నలు వంటి తృణధాన్యాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచి, మీకు ఎనర్జీ లెవెల్స్ అందిస్తాయి.

2. డ్రై ఫ్రూట్స్, విత్తనాలు:

బాదం, వాల్‌నట్స్, చియా విత్తనాలు, గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడును చురుగ్గా ఉంచి అలసట రానివ్వవు.

3. గుడ్లు:

గుడ్లలో ఉండే ‘ల్యూసిన్’ అనే అమినో యాసిడ్ కణాలకు శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మిమ్మల్ని రోజంతా ఎనర్జీగా ఉండేలా చేస్తాయి.

4. పెరుగు:

పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. జీర్ణక్రియ బాగుంటే శరీంలో తక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. దీనివల్ల మీరు వెంటనే అలసిపోకుండా ఉంటారు.

5.అరటిపండ్లు:

అరటిపండులో గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. కండరాల పనితీరు మెరుగ్గా ఉంచడానికి దోహదపడుతుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?

పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?

For More Latest News

Updated Date - Jan 31 , 2026 | 02:54 PM