కడుపులో మంట, గ్యాస్ తగ్గడానికి తీసుకోవాల్సిన ఆహారమిదే..
ABN , Publish Date - Jan 30 , 2026 | 02:12 PM
ఈ మధ్య చాలా మంది జంక్ ఫుడ్‌కి అలవాటు పడటంతో కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్ కారణంగా ఇబ్బంది పడుతున్నారు. కడుపులో మంట తగ్గేందుకు తీసుకోవాల్సిన బెస్ట్ ఫుడ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: కడుపులో మంట అనేది మనం తీసుకునే ఆహారం, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. కడుపులో మంట కంట్రోల్ చేసేందుకు అప్పటికప్పుడు ఎన్నో రకాల మందులు, సిరప్‌లు తీసుకుంటుంటారు. మంచి ఆహారం తీసుకుంటే ఎలాంటి కడుపు మంట ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మజ్జిగ: మజ్జిగలో కొంచెం వాము లేదా జీలకర్ర పొడి కలుపుకొని తాగితే కడుపు మంట తగ్గి చల్లగా అనిపిస్తుంది. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
చల్లని పాలు: ఒక గ్లాసు చల్లని పాలు చక్కెర లేకుండా తాగితే కడుపులో ఉపశమనం కలుగుతుంది.
కొబ్బరి నీళ్లు: ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని ఆమ్లతత్వాన్ని తగ్గించి, పీహెచ్ స్థాయిని సమతుల్యం చేస్తాయి.
అరటిపండు: ఇది సహజ సిద్దమైన ‘యాంటాసిడ్’ లా పనిచేస్తుంది. పండిన అరటిపండు ఇంకా మంచిది.
పుచ్చకాయ: ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి మంట తగ్గిస్తుంది.
సోంపు: భోజనం తర్వాత కొద్దిగా సోంపు గింజలు నమలడం వల్ల గ్యాస్, మంట తగ్గుతుంది
అల్లం టీ: ఇందులో యంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. చిన్న అల్లం ముక్కను నీటిలో మరిగించి తాగితే ఉపశమనం కలుగుతుంది.
తులసి ఆకులు: రోజూ రెండు, మూడు తులసి ఆకులు నమలడం వల్ల కడుపులో ఆమ్ల స్థాయి తగ్గుతుంది.