రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగడం మంచి అలవాటేనా?
ABN , Publish Date - Jan 30 , 2026 | 08:42 PM
ప్రతి మనిషికీ నీరు చాలా అవసరం. ఇది అందరికీ తెలిసిన విషయమే. రోజూ తగినంత నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ పడుకునే ముందు నీరు తాగడం మంచిదేనా?
ఇంటర్నెట్ డెస్క్: రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. నీరు ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో అందరికీ తెలింసిందే. రోజూ సరిపడా నీరు తాగితే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ పడుకునే ముందు నీరు తాగడం మంచిదా? కాదా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. నిజానికి ఈ అలవాటుకు కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, జాగ్రత్తలు తీసుకోకపోతే నిద్రకు అంతరాయం కలగొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే పడుకునే ముందు నీరు తాగితే కలిగే లాభాలు ఏమిటి? ఎక్కువగా తాగితే వచ్చే సమస్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
పడుకునే ముందు నీరు తాగడం..
పడుకునే ముందు నీరు తాగితే శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లడానికి సహాయపడుతుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. శరీరం చల్లబడుతుంది, మంచి నిద్ర వస్తుంది. గోరువెచ్చని నీరు తాగితే కండరాల నొప్పులు తగ్గుతాయి, జీర్ణక్రియ బాగా జరుగుతుంది. నిమ్మరసం కలిపిన నీరు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది, చర్మానికి మెరుపు వస్తుంది.
ఎక్కువ నీరు తాగితే వచ్చే సమస్యలు..
పడుకునే ముందు ఎక్కువగా నీరు తాగితే రాత్రిపూట తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల నిద్ర భంగం కలుగుతుంది. సరైన నిద్ర లేకపోతే అలసట, తలనొప్పి, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిపుణుల సూచనలివే..
నీరు తాగిన వెంటనే నిద్రపోవడం మంచిది కాదు.
పడుకునే ముందు కనీసం 1–2 గంటల ముందు నీరు తాగడం మంచిది.
రాత్రి భోజనం చేసిన కొంతసేపటి తర్వాత నీరు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
దాహం వేస్తే ఎక్కువ నీరు తాగడం కాకుండా కొద్దిగా సిప్ తీసుకోవడం మంచిది.
నీరు ఆరోగ్యానికి ఎంతో అవసరం. కానీ పడుకునే ముందు నీరు తాగేటప్పుడు సరైన సమయం, పరిమితి పాటిస్తేనే మంచి ఫలితం ఉంటుంది. అలా చేస్తే ఆరోగ్యం కూడా బాగుంటుంది, అలాగే ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?
పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?
For More Latest News