రోజంతా హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటున్నారా?
ABN , Publish Date - Jan 30 , 2026 | 02:17 PM
చాలా మంది హెడ్‌ఫోన్లను రోజంతా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది చెవుల ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. చెవుల ఆరోగ్యానికి నిపుణుల సూచనలు పాటించండి..
ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో చాలా మంది గంటల తరబడి హెడ్‌ఫోన్స్ లేదా ఇయర్‌ఫోన్స్ ఉపయోగిస్తున్నారు. మొబైల్, ల్యాప్‌టాప్, కాల్స్, మీటింగ్స్, పాటలు వినడం… ఇలా హెడ్‌ఫోన్స్ రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. కానీ ఎక్కువసేపు హెడ్‌ఫోన్స్ వాడితే చెవుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.
ఆరోగ్య నిపుణుల ప్రకారం, అధిక వాల్యూమ్‌లో పాటలు వినడం, నాణ్యత లేని ఇయర్‌ఫోన్స్ వాడటం, గంటల తరబడి హెడ్‌ఫోన్స్ వాడడం వల్ల వినికిడి శక్తి క్రమంగా తగ్గే ప్రమాదం ఉంది. చాలాసార్లు మొదటి లక్షణాలను మనం పట్టించుకోం.. కానీ చెవి నొప్పి, బరువుగా అనిపించడం, చిన్న శబ్దం కూడా ఇబ్బందిగా అనిపించడం లాంటివి భవిష్యత్తులో వచ్చే సమస్యలకు సంకేతాలు కావొచ్చు.
ఏం చేయాలి?
ENT నిపుణుల ప్రకారం, హెడ్‌ఫోన్స్‌ను సరైన విధంగా ఉపయోగించడం చాలా ముఖ్యం.
ఎప్పుడూ మితమైన వాల్యూమ్‌లో పాటలు లేదా కాల్స్ వినండి.
హెడ్‌ఫోన్స్ ఎక్కువసేపు వాడకుండా మధ్య మధ్యలో విరామం తీసుకోవాలి.
చెవులకు ఒత్తిడి కలిగించని, మంచి నాణ్యత గల హెడ్‌ఫోన్స్ ఎంచుకోవాలి.
చెవులను శుభ్రంగా ఉంచుకోండి. కానీ పదునైన వస్తువులతో శుభ్రం చేయొద్దు.
అవసరం లేని సమయంలో హెడ్‌ఫోన్స్ తీసేసి చెవులకు విశ్రాంతి ఇవ్వండి.
ఏదైనా అసౌకర్యం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
చెవులను నిర్లక్ష్యం చేస్తే వచ్చే సమస్యలివే..
చెవులపై శ్రద్ధ పెట్టకపోతే వినికిడి లోపం వచ్చే అవకాశం ఉంది.
చెవుల్లో రింగింగ్ శబ్దం..
నొప్పి లేదా బరువుగా అనిపించడం..
చెవి ఇన్ఫెక్షన్లు..
నిద్ర, ఏకాగ్రతపై ప్రభావం..
ముఖ్య సూచనలు..
అధిక వాల్యూమ్‌లో పాటలు వినొద్దు.
గంటకు ఒకసారి హెడ్‌ఫోన్స్ నుంచి విరామం తీసుకోండి.
చెవులను పొడిగా, శుభ్రంగా ఉంచండి.
దెబ్బతిన్న ఇయర్‌ఫోన్స్ వాడొద్దు.
సమస్య ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?
పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?
For More Latest News