Share News

వానతి శ్రీనివాసన్‌కు మద్దతుగా కుమారుడి ప్రచారం

ABN , Publish Date - Apr 14 , 2026 | 01:50 PM

తమిళనాడులోని కోయంబత్తూర్‌ ఉత్తరం నియోజకవర్గంలో బీజేపీ తరఫున ఆ పార్టీ జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్‌ పోటీ చేస్తున్నారు.

వానతి శ్రీనివాసన్‌కు మద్దతుగా కుమారుడి ప్రచారం

చెన్నై: కోయంబత్తూర్‌ ఉత్తరం నియోజకవర్గంలో బీజేపీ తరఫున ఆ పార్టీ జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్‌ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనారోగ్యం కారణంగా ఆమె కోవైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని ఆమెకు వైద్యులు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుదిదశలో చేరుకున్న నేపథ్యంలో వానతి శ్రీనివాసన్‌ తరఫున ఆమె కుమారుడు ఆదర్శ్‌ నియోజకవర్గం కలియ తిరుగుతూ అమ్మకు మద్దతుగా ఓట్లు అభ్యర్థిస్తున్నారు.


nani3.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు స్పీకర్, హోం మంత్రి ఘన నివాళి

రాజధాని అమరావతి జోలికొస్తే ఖబడ్దార్‌

Read Latest Telangana News and National News

Updated Date - Apr 14 , 2026 | 01:50 PM