Share News

ఊటీలో పెరిగిన పర్యాటకుల రద్దీ

ABN , Publish Date - Apr 14 , 2026 | 01:10 PM

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యాటక ప్రాంతం ఊటీలో గత నాలుగు రోజులుగా దేశవిదేశాల పర్యాటకుల రద్దీ అధికమైంది. గత శని, ఆదివారాల్లో వేల సంఖ్యలో పర్యాటకులు వచ్చారు.

ఊటీలో పెరిగిన పర్యాటకుల రద్దీ

  • సర్క్యూట్‌ బస్సులకు విశేష ఆదరణ

చెన్నై: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యాటక ప్రాంతం ఊటీలో గత నాలుగు రోజులుగా దేశవిదేశాల పర్యాటకుల రద్దీ అధికమైంది. గత శని, ఆదివారాల్లో వేల సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. వీరంతా సోమవారం వేకువజాముకల్లా స్వస్థలాలకు బయలుదేరి వెళతారని స్థానిక వ్యాపారులు అనుకున్నారు. అయితే సోమవారం ఉదయం నుంచి కూడా ఊటీలో బోట్‌ హౌస్‌, బొటానికల్‌ గార్డెన్‌, కున్నూరు వద్దనున్న రోస్‌ గార్డెన్‌, సిమ్స్‌ పార్క్‌, కాట్టేరి గార్డెన్‌, లేమ్స్‌రాక్‌, డాల్ఫిన్‌ నోస్‌ తదితర ప్రాంతాల వద్ద పర్యాటకులు సెల్ఫీలు కూడా తీసుకున్నారు. ఇదే విధంగా తేయాకు తోటలనుకూడాసందర్శించారు. సోమవారం సాయంత్రం వరకూ ఊటీలో ఎటు చూసిన పర్యాటకులే కనిపించారు. పర్యాటకుల రాక అధికం కావటంతో స్థానిక దుకాణాల్లో అమ్మకాలు ఊపందుకున్నాయి.


nani1.2.jpgసర్క్యూట్‌ బస్సుల ప్రారంభం...

ఇదిలా ఉండగా నీలగిరి జిల్లాలో సమ్మర్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో పర్యాటకుల రద్దీ పెరిగింది. ఈ పర్యాటకులు ఊటీ, కున్నూరు తదితర ప్రాంతాల సందర్శనకు అనువుగా సర్క్యూట్‌ బస్సులకు విశేష స్పందన లభిస్తోంది. ఈబస్సులు ప్రతి అరగంటకు ఒకసారి ఊటీలోని ప్రముఖ ప్రాంతాలకు వెళ్ళి బయలుదేరిన ప్రాంతానికే తిరిగి వస్తాయి.


nani1.3.jpgఈ బస్సులలో పెద్దలకు రూ.100లు, చిన్నారులకు రూ.50లు చొప్పున ఛార్జీ వసూలు చేస్తున్నారు. ఈబస్సులలో ప్రయాణించేవారికి టికెట్‌కుబదులుగా పాస్‌ ఇస్తారు. ఆపా్‌సతో సర్క్యూట్‌బస్సుల్లో తమకు నచ్చిన ప్రాంతంలోదిగి, అక్కడి నుండి మళ్ళీ తమకు నచ్చిన ప్రాంతానికి వెళ్లేందుకు వీలుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నాలుగు సర్క్యూట్‌ బస్సులు నడుపుతున్నామని, ప్రయాణికుల సంఖ్య పెరుగుదలను బట్టి సంఖ్య పెంచుతామని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు స్పీకర్, హోం మంత్రి ఘన నివాళి

రాజధాని అమరావతి జోలికొస్తే ఖబడ్దార్‌

Read Latest Telangana News and National News

Updated Date - Apr 14 , 2026 | 01:10 PM