ప్రియుడితో వెళ్లిపోయిన కుమార్తె.. మనస్తాపంతో తల్లిదండ్రుల ఆత్మహత్య
ABN , Publish Date - Apr 14 , 2026 | 01:28 PM
కుమార్తె ప్రియుడితో వెళ్లిపోవడాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈరోడ్ జిల్లా నాగర్‌పాళయం శక్తి గార్డన్‌కు చెందిన మాదేశ్వరన్ (45) ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్నారు.
చెన్నై: కుమార్తె ప్రియుడితో వెళ్లిపోవడాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈరోడ్ జిల్లా నాగర్‌పాళయం శక్తి గార్డన్‌కు చెందిన మాదేశ్వరన్ (45) ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్నారు. ఆయన భార్య చంద్ర (40) ప్రైవేటు విద్యుత్ సంస్థలో పనిచేస్తోంది. ఈ దంపతులకు సోనా అనే కుమార్తె, బాలాజి అనే కుమారుడు ఉన్నారు. సోనా కోయంబత్తూర్‌లోని ఓ సంస్థలో డిజైనర్‌గా పనిచేస్తోంది. సోనా కొద్దిరోజులుగా దామోదరన్ అనే యువకుడిని ప్రేమిస్తున్నట్లు తెలిసింది. వీరి ప్రేమకు సోనా తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు.
ఈ క్రమంలో, ఆదివారం ఉదయం సోనా ప్రియుడితో కలసి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఈ కారణంగా మనస్తాపం చెందిన మాదేశ్వరన్, సంగీత ఇంట్లో విషం తాగి స్పృహతప్పి పడిపోయారు. చుట్టుపక్కల వారు వారిని వెంటనే గోపిచెట్టిపాళయం తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరురైన చికిత్స కోసం కోయంబత్తూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స ఫలించక ఇరువురూ మృతిచెందారు. ఈ ఘటనపై గోపిచెట్టిపాళయం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి:
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు స్పీకర్, హోం మంత్రి ఘన నివాళి
రాజధాని అమరావతి జోలికొస్తే ఖబడ్దార్
Read Latest Telangana News and National News