ఐపీఎల్2026: రాజస్థాన్‌కు యముడయ్యాడు.. ఎవరూ ప్రఫుల్ హింగే!
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:25 PM
సన్ రైజర్స్ హైదరాబాద్ నయా పేసర్ ప్రఫుల్ హింగే ఐపీఎల్‌లో తన తొలి మ్యాచ్‌లోనే సంచలనం సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను వేసిన తొలి ఓవర్లోనే మూడు వికెట్లు పడగొట్టి .. యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: ప్రతిరంగంలో ఉన్నట్లే.. క్రికెట్‌లోనూ తీవ్రమైన పోటీ ఉంటుంది. తమ ప్రతిభను చాటుకోవాలని యువ క్రికెటర్లు భావిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ..తమకు వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకోలేక కనుమరుగవుతుంటారు. మరికొందరు మాత్రం తమకు వచ్చిన చిన్న అవకాశాన్ని సైతం చరిత్ర గుర్తుపెట్టుకునేలా మార్చుకుంటారు. ఆ కోవాకు చెందిన వ్యక్తే సన్ రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్ ప్రఫుల్ హింగే. నిన్న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన అద్భుత ప్రదర్శనతో ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అరంగేట్ర ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న ప్రఫుల్ హింగే సంచలన ప్రదర్శనతో మెరిశాడు. నిన్న(సోమవారం)రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే 3 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికి వైభవ్ సూర్యవంశీని గోల్డెన్ డకౌట్‌గా పంపాడు. ఆ తర్వాత నాలుగో బంతికి ధ్రువ్ జురేల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అదే ఓవర్ చివరి బంతికి ప్రిటోరియస్‌ను వెనక్కి పంపి.. రాజస్థాన్‌కు యుముడిగా మారాడు. తొలి ఓవర్లోనే 3 వికెట్లు సాధించిన ప్రఫుల్ హింగే అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీయడం ఇదే తొలిసారి. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా ప్రఫుల్ నిలిచాడు. గతంలో తొలి ఓవర్లో బౌలర్లు 32 సార్లు రెండు వికెట్లు తీసిన సందర్భాలున్నాయి. ప్రఫుల్ హింగే బౌలింగ్‌లో ఔటైన ముగ్గురు రాజస్థాన్ బ్యాటర్లు డకౌట్‌లుగానే వెనుదిరగడం విశేషం. నిన్నటి మ్యాచ్‌తో వెలుగులోకి వచ్చిన ప్రఫుల్ హింగే గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.
ఎవరీ ప్రఫుల్ హింగే?
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన ప్రఫుల్ హింగే కుడిచేతి వాటం బౌలర్. ఐపీఎల్ 2026 వేలంలో ఎస్‌ఆర్‌హెచ్ ప్రఫుల్ హింగేను రూ. 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. ప్రఫుల్ తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. బాగా చదువుకుని తనలాగే ప్రభుత్వ ఉద్యోగి కావాలనేది ఆయన కోరిక. కానీ క్రికెట్‌పై ప్రఫుల్‌కు ఉన్న ఆసక్తిని గుర్తించి.. అటువైపుగా ప్రొత్సహించారు. అతడి సోదరి మద్దతు కూడా అద్భుతం. ఆమె సీఏ వృత్తిని కొనసాగిస్తూనే.. ప్రఫుల్‌ను గంటల తరబడి జరిగే ప్రాక్టీస్ సెషన్స్‌కు తీసుకెళ్లేవారు. అలా కుటుంబ ప్రొత్సాహంతో ప్రఫుల్ మంచి క్రికెటర్‌గా ఎదిగాడు.
తాజాగా ఐపీఎల్ 2026లో హైదరాబాద్ జట్టుకు బ్యాకప్ బౌలర్‌గా వచ్చిన ప్రఫుల్ హింగే రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో సూపర్ ప్రదర్శన కనబరిచి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. ప్రఫుల్ హింగే 10 ఫ్లస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడి 27 వికెట్లు తీశాడు. 6 లిస్ట్-ఏ మ్యాచ్‌లాడి 5 వికెట్లు తీశాడు. అయితే తన కెరీర్‌లో ఇప్పటివరకు ఒక టీ20 మ్యాచ్ మాత్రమే ఆడడం గమనార్హం. మొత్తంగా తన అరంగేట్రం చరిత్రలో నిలిచిపోవాలని తలచాడు.. రాజస్థాన్ మ్యాచ్‌లో చేసి చూపించాడు ఈ నయా పేసర్ ప్రఫుల్ హింగే.
ఇవి కూడా చదవండి:
వైభవ్ దూకుడు.. సచిన్ రికార్డుకు పొంచి ఉన్న ముప్పు
ఘోర ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన రాజస్థాన్