టీవీకే గుర్తు విజిలా...? కెమెరానా...?
ABN , Publish Date - Apr 16 , 2026 | 01:40 PM
ప్రముఖ సినీ నటుడు విజయ్ పోటీ చేస్తున్న పెరంబూరు నియోజకవర్గ వాసులకు ఓ పెద్ద చిక్కొచ్చిపడింది.
పెరంబూర్ ఓటర్లలో అయోమయం
చెన్నై: ప్రముఖ సినీ నటుడు విజయ్ పోటీ చేస్తున్న పెరంబూరు నియోజకవర్గ వాసులకు ఓ పెద్ద చిక్కొచ్చిపడింది. ఇంతకీ ఆయన నేతృత్వం వహిస్తున్న టీవీకే చిహ్నం ఏంటన్నది పెద్ద సందేహంగా మారింది. ఎందుకలా అంటారా?.. అయితే విషయంలోకి వెళ్దాం రండి! జోసఫ్ విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల్లో పోటీచేస్తున్న విషయం తెలిసిందే.
కాగా, 2021లో డీఎంకే కూటమిలో ఉన్న వేల్‌మురుగన్ నేతృత్వంలోని ‘తమిళగ వాల్వురిమై కట్చి’ ప్రస్తుతం ఒంటరిగా పోటీచేస్తోంది. ఆ పార్టీ తరఫున పెరంబూరు నుంచి టి.వేణుగోపాల్ అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు. ఆయన ఇంటింటి ప్రచారం చేస్తూ తమ పార్టీ టీవీకే అని, కెమెరా చిహ్నంపై ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. దీంతో టీవీకే చిహ్నంపై ప్రజల్లో గందరగోళం నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి:
మహిళా రిజర్వేషన్.. లోక్‌సభ ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లు
Read Latest Telangana News and National News