అతివేగానికి మూడు నిండుప్రాణాల బలి
ABN , Publish Date - Apr 16 , 2026 | 12:25 PM
తమిళనాడులోని విరుదునగర్ జిల్లా శివకాశిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణంపాలయ్యారు.
టూరిస్టు బస్సు ఢీకొని ముగ్గురు విద్యార్థుల దుర్మరణం
చెన్నై: విరుదునగర్ జిల్లా శివకాశిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణంపాలయ్యారు. పేర్నాయకన్‌పట్టికి చెందిన గోకుల్ (17) శివకాశిలోని ఓ పాఠశాలలో ప్లస్ టూ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాడు. గోకుల్ సెల్‌ఫోన్ పనిచేయకపోవడంతో, మరమ్మతు చేయించేందుకు మంగళవారం బంధువు ద్విచక్రవాహనం తీసుకుని శివకాశికి వెళ్లాడు. సెల్‌ఫోన్ రిపేర్ ఆలస్యం అవుతుందని మెకానిక్ చెప్పడంతో, తనతోపాటు చదువుతున్న యువరాజ్ (17), ప్రసన్న(17) దగ్గరకు గోకుల్ వెళ్లాడు.
రాత్రి 9.45గంటలకు తిరిగి సెల్‌ఫోన్ తీసుకున్న గోకుల్.. ఇద్దరు స్నేహితులతో కలసి టీ తాగేందుకు బైక్‌పై సాత్తూర్-కోవిలంపట్టి మార్గంగా వెళ్లాడు. ఆ సమయంలో వేగంగా వచ్చిన టూరిస్టు బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌నుంచి కిందపడి తలకు బలమైనగాయాలైన ముగ్గురూ ఘటనా స్థలంలోనే మృతిచెందారు. ఆలస్యంగా సమాచారం అందుకున్న సాత్తూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదుచేసిన పోలీసులు, బస్ డ్రైవర్ ఆమ్‌స్ట్రాంగ్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మహిళా రిజర్వేషన్.. లోక్‌సభ ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లు
Read Latest Telangana News and National News