Share News

మహిళా రిజర్వేషన్.. లోక్‌సభ ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లు

ABN , Publish Date - Apr 16 , 2026 | 11:40 AM

మహిళా రిజర్వేషన్, లోక్‌సభ సీట్ల పెంపు, నియోజకవర్గ పునర్విభజనకు సంబంధించి కీలకమైన మూడు బిల్లులను నేడు కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

మహిళా రిజర్వేషన్.. లోక్‌సభ ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లు
131st Constitutional Amendment Bill Tables in Loksabha

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో చరిత్రాత్మక ఘట్టానికి పార్లమెంటు శ్రీకారం చుట్టింది. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాలు పునర్విభజన బిల్లులను కేంద్రం లోక్‌సభ ముందుంచింది. నేడు సభలో సమావేశం ప్రారంభమైన అనంతరం, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. అనంతరం చర్చ మొదలైంది.


లోక్‌సభ సీట్ల సంఖ్యను గరిష్ఠంగా 850కి పెంచేలా 131వ రాజ్యాంగసవరణను కేంద్రం ప్రవేశపెట్టింది. డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కోసం ఉద్దేశించిన మరో బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు మరో బిల్లులను కేంద్రం పార్లమెంటు ముందుకు తీసుకొచ్చింది. ఈ మూడింటిపై ఒక్కో సభలో 18 గంటల పాటు చర్చించనున్నారు. ఇక ప్రధాని మోదీ సాయంత్రం బిల్లుపై ప్రసంగిస్తారు.


ఈ వార్తలూ చదవండి:

డీలిమిటేషన్ బిల్లుపై అసంతృప్తి.. కాపీలను తగలబెట్టిన సీఎం స్టాలిన్

డీలిమిటేషన్ బిల్లుపై అసంతృప్తి.. కాపీలను తగలబెట్టిన సీఎం స్టాలిన్

Updated Date - Apr 16 , 2026 | 11:57 AM