Share News

అందుకే ఈ మూడు బిల్లులను మేము వ్యతిరేకిస్తున్నాం: అఖిలేష్ యాదవ్

ABN , Publish Date - Apr 16 , 2026 | 11:57 AM

కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టిన మూడు బిల్లులను వ్యతిరేకిస్తున్నట్లు యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తెలిపారు.

అందుకే ఈ మూడు బిల్లులను మేము వ్యతిరేకిస్తున్నాం: అఖిలేష్ యాదవ్
akhilesh yadav

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టేందుకు ఇవాళ(గురువారం) పార్లమెంట్‌ ప్రత్యేకంగా సమావేశమైంది. డీలిమిటేషన్‌ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు కేంద్రం3 బిల్లులను లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌, హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లుపై యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.


ఓబీసీ, ముస్లిం మహిళల కోటా లేకుండా ఉన్న ఈ బిల్లులకు మద్దతు ఇవ్వబోమని, వాటిని వ్యతిరేకిస్తున్నామని అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఈ మూడు బిల్లులు ద్వారా బీజేపీ రాజ్యాంగాన్ని వక్రీకరించడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. జనాభా లెక్కల నుంచి నియోజకవర్గాల పునర్విభజనను వేరు చేస్తుందని ఆరోపించారు. ఈ బిల్లులను ఉపసంహరించుకుని, దానికి బదులుగా 2023 చట్టాన్ని అమలు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. తమ పార్టీ ఈ బిల్లులను రాజ్యాంగపరమైన కారణాలతో తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. మూడు ప్రధాన బిల్లులపై చర్చ

రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ చీఫ్ నితిన్ నబీన్

Updated Date - Apr 16 , 2026 | 12:17 PM