Share News

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. మూడు ప్రధాన బిల్లులపై చర్చ

ABN , Publish Date - Apr 16 , 2026 | 11:48 AM

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఇటీవల మృతిచెందిన పలువురు ప్రముఖులకు లోక్‌సభలో నివాళులర్పించారు. అనంతరం ప్రధాన బిల్లుపై చర్చ మొదలైంది.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. మూడు ప్రధాన బిల్లులపై చర్చ
Arjun Ram Meghwal at Loksabha

ఇంటర్నెట్ డెస్క్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ముందుగా ఇటీవల మృతిచెందిన ప్రముఖ గాయని ఆశాభోస్లే సహా మాజీ మంత్రి హసీం ఖాన్ చౌధరీ తదితరులకు లోక్‌సభ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం మూడు ప్రధాన బిల్లులపై చర్చ మొదలైంది. తొలుత మహిళా రిజర్వేషన్‌ బిల్లు, నియోజకవర్గ పునర్విభజన బిల్లుపై కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ చర్చను ప్రారంభించారు.


అనంతరం.. డీలిమిటేషన్‌ ప్రక్రియ చేపట్టే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు అవసరమైన డీలిమిటేషన్‌ కమిషన్‌ ఏర్పాటుకు సంబంధించిన మరో బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించే ఇంకో బిల్లులు సభలో చర్చకు రానున్నాయి.

Updated Date - Apr 16 , 2026 | 11:52 AM