Share News

రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ చీఫ్ నితిన్ నబీన్

ABN , Publish Date - Apr 16 , 2026 | 11:43 AM

రాజ్యసభ సభ్యుడిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీకి సీనియర్ నేతలు పలువురు హాజరయ్యారు.

రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ చీఫ్ నితిన్ నబీన్

న్యూఢిల్లీ, ఏప్రిల్16: రాజ్యసభ సభ్యుడిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. అలాగే వేం నరేందర్ రెడ్డి, అభిషేక మను సింఘ్వీలు కూడా ఈ రోజే రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వేం నరేంద్ర రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.


బిహార్ నుంచి రాజ్యసభకు..

బిహార్‌కు చెందిన నితిన్ నబీన్ ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో బిహార్‌లోని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బిహార్ నుంచి నితిన్ నబీన్, శివేష్ రామ్‌‌, నితీశ్ కుమార్‌తోపాటు పలువురిని రాజ్యసభ అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించింది. రాజ్యసభకు వీరు ఎంపిక కావడంతో.. సభ్యుడిగా బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.


తెలంగాణ నుంచి రెండు..

తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. అవి అధికార కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడ్డాయి. పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని వరుసగా రెండోసారి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపింది. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా ముద్రపడిన వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేశారు. దీంతో వీరిద్దరి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ రోజు వారి ప్రమాణ స్వీకారం జరిగింది. తెలంగాణలో ఈ రెండు రాజ్యసభ స్థానాల్లో తీవ్ర పోటీ నెలకొంది. పలువురు సీనియర్లు సైతం తమకు రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించాలంటూ పార్టీ అధిష్ఠానానికి వరుస బెట్టి లేఖలు రాశారు. చివరకు ఆ ఎంపీ పదవి కాస్తా వేం నరేందర్ రెడ్డిని వరించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నష్టపరిహారం ప్రకటించిన ప్రధాని

దాటవేత.. మౌనం.. యాగీ!

For More National News And Telugu News

Updated Date - Apr 16 , 2026 | 12:34 PM