Share News

పార్లమెంట్‎లో కీలక పరిణామం.. బిల్లుకు మద్దతుగా మెజార్టీ సభ్యుల ఓటు

ABN , Publish Date - Apr 16 , 2026 | 12:41 PM

ఇవాళ లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలా వద్దా అనే అంశంపై కీలక ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్‌లో బిల్లును ప్రవేశపెట్టేందుకు మెజార్టీ సభ్యులు మద్దతు తెలిపారు.

పార్లమెంట్‎లో కీలక పరిణామం.. బిల్లుకు మద్దతుగా మెజార్టీ సభ్యుల ఓటు
Lok Sabha voting 131st amendment bill

ఇంటర్నెట్ డెస్క్: ఇవాళ (గురువారం) లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలా వద్దా అనే అంశంపై కీలక ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్‌లో బిల్లును ప్రవేశపెట్టేందుకు మెజార్టీ సభ్యులు మద్దతు తెలిపారు. మొత్తం 333 ఓట్లు పోలవగా, వాటిలో 207 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా, 126 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు.


ఈ ఓటింగ్ ఫలితంతో 131వ రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమమైంది. అయితే ఈ బిల్లుపై విపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (SP), తృణమూల్ కాంగ్రెస్ (TMC), డీఎంకే, ఎంఐఎం, ఆప్నా దళ్ (ASP), సీపీఎం వంటి పార్టీల సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. విపక్షాలు ఈ బిల్లుపై రాజ్యాంగపరమైన సందేహాలు వ్యక్తం చేస్తూ, దీని ప్రభావం ప్రజాప్రతినిధుల వ్యవస్థపై పడే అవకాశం ఉందని ఆరోపించాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఈ సవరణ బిల్లు పరిపాలనా, ఎన్నికల సంస్కరణలకు అవసరమని వాదించాయి. ఈ ఓటింగ్‌తో బిల్లును ముందుకు తీసుకెళ్లేందుకు తొలి దశ పూర్తయింది. ఇకపై సభలో దీనిపై మరింత విస్తృత చర్చ జరగనుంది.


ఇవీ చదవండి:

మా అభిప్రాయాన్ని ముందే చెప్పాం.. రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై సోనియా గాంధీ

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. మూడు ప్రధాన బిల్లులపై చర్చ

Updated Date - Apr 16 , 2026 | 12:48 PM