Share News

మా అభిప్రాయాన్ని ముందే చెప్పాం.. రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై సోనియా గాంధీ

ABN , Publish Date - Apr 16 , 2026 | 12:09 PM

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై తమ పార్టీ అభిప్రాయాన్ని ముందే స్పష్టం చేశామని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అన్నారు. ఈ విషయంలో కొత్తగా తాను చెప్పాల్సిందేమీ లేదని తెలిపారు.

మా అభిప్రాయాన్ని ముందే చెప్పాం.. రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై సోనియా గాంధీ

ఇంటర్నెట్ డెస్క్: మహిళల రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గ పునర్విభజన బిల్లులపై కాంగ్రెస్ నేత సోనియా గాంధీ తాజాగా స్పందించారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు స్పందిస్తూ తమ పార్టీ వైఖరిని ముందే తెలియజేశామని అన్నారు. ఈ విషయంలో అదనంగా తాను చెప్పాల్సిందేమీ లేదని పేర్కొన్నారు.


ఇందుకు సంబంధించిన బిల్లులను నేడు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్‌వాల్, హోం మంత్రి అమిత్‌షా లోక్‌సభ ముందుకు తీసుకొచ్చారు. 131వ రాజ్యంగసవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులను మంత్రి మేఘ్‌వాల్ ప్రవేశపెట్టగా, కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాలకు సంబంధించిన బిల్లును అమిత్ షా సభ ముందు పెట్టారు. బిల్లులను అనుమతించాలా? వద్దా? అన్న అంశంపై ఓటింగ్ జరగ్గా మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. ఈ బిల్లులపై 12 గంటల పాటు చర్చ జరగనుంది. అవసరమైతే సమయాన్ని స్పీకర్ పొడిగిస్తారని కేంద్రం పేర్కొంది. రేపు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరిగే అవకాశం ఉంది.

Updated Date - Apr 16 , 2026 | 01:01 PM