Share News

మేము ఓటింగ్‌కు దూరం..

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:53 PM

తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని పాలక్కోడు రెవెన్యూ పరిధిలోవున్న జిట్టన్‌దల్లి పంచాయతీ, వజ్జరపల్లం గ్రామస్తులు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోమని ప్రకటించారు.

మేము ఓటింగ్‌కు దూరం..

  • వజ్జరపల్లం గ్రామస్తుల నిర్ణయం

చెన్నై: ధర్మపురి జిల్లాలోని పాలక్కోడు రెవెన్యూ పరిధిలోవున్న జిట్టన్‌దల్లి పంచాయతీ, వజ్జరపల్లం గ్రామస్తులు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోమని ప్రకటించారు. వజ్జరపల్లం గ్రామంలో సుమారు 30 కుటుంబాలు నివశిస్తున్నాయి. వారు ఐదు తరాలుగా వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్నారు. గతంలో బీడుగా ఉన్న ఈ ప్రాంతాన్ని కొన్ని సంవత్సరాల నుండి అటవీ ప్రాంతంగా మార్చినప్పటి నుంచి వ్యవసాయం చేయవద్దని, వారు పెంచిన కొబ్బరి, మామడి పంటను కోయ్యవద్దని శాసించి అటవీశాఖ అధికారులు, వారు నివసిస్తున్న ఇళ్లు, గోశాలలను తొలగించాలని బెదిరించడం గత ఐదేళ్లుగా కొనసాగుతున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు.


తమను బెదిరిస్తున్న పాలక్కోడు అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి, వ్యవసాయ భూములకు పట్టాలివ్వాలని కోరుతూ గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యే, ఎంపీల వద్ద వినతిపత్రం సమర్పించినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవని తెలిసింది. ఇదిలా వుండగా, బుధవారం ఉదయం నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన వజ్జరపల్లం గ్రామస్తులు వచ్చే ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోమని ప్రకటించారు. అంతేకాకుండా ప్రభుత్వం పంపిణీ చేసిన రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఓటర్‌ కార్డులను అధికారుల వద్ద అప్పగిస్తామని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధరలు..

‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ కార్యాలయంపై వైసీపీ మూకల దాడి హేయమైన చర్య

Read Latest Telangana News and National News

Updated Date - Apr 09 , 2026 | 12:53 PM