తమిళనాడులో 14.59లక్షల మంది కొత్త ఓటర్లు
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:25 PM
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5కోట్ల 73లక్షల 43వేల 291 మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోనున్నారు.
చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5కోట్ల 73లక్షల 43వేల 291 మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోనున్నారు. కాగా, రాష్ట్రంలో గత 2024 లోక్‌సభ ఎన్నికల అనంతరం కొత్త ఓటర్ల సంఖ్య 34 శాతానికి పెరిగి ప్రస్తుతం 14.59లక్షల మంది తొలిసారిగా ఓటేయ్యనున్నారు. ఒకే విడతగా పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పూర్తిచేసిన అనంతరం 5.65కోట్ల మంది ఓటర్లతో జాబితా విడుదలైంది. ఆ తర్వాత తొలగించిన ఓటర్లలో మళ్లీ రీ వెరిఫికేషన్ కోసం నమోదు చేసుకున్న 6.36లక్షల మందితో కలిపి మొత్తం 5.73కోట్ల మంది ఓట్లర్ల జాబితాను సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ విడుదల చేశారు.
ఈ నేపథ్యంలో, రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో 18 నుంచి 19యేళ్లు నిండిన కొత్త ఓటర్ల సంఖ్య గత లోక్‌సభ ఎన్నికల కంటే సుమారు 33.6 శాతానికి పెరిగినట్లు ప్రకటించారు. సర్ చర్యల వల్ల ఓటర్ల సంఖ్య ప్రస్తుతం 5.73కోట్లకు తగ్గినప్పటికీ కొత్త ఓటర్ల సంఖ్య 1.8 శాతం నుండి 2.5శాతానికి పెరిగింది. మొత్తం ఓటు హక్కు కలిగిన 5,73,43,291 మందిలో మహిళలు 2,93,04,905, పురుషు లు 2,80,30,658కాగా, ఇతరులు 7,728 మంది ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధరలు..
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ కార్యాలయంపై వైసీపీ మూకల దాడి హేయమైన చర్య
Read Latest Telangana News and National News