Share News

ఈపీఎస్, దినకరన్ బీజేపీకి బానిసలు

ABN , Publish Date - Apr 18 , 2026 | 12:10 PM

గత ఐదేళ్లుగా రాష్ట్రాభివృద్ధికి నిధులివ్వకుండా, రాష్ట్ర హక్కులను హరించివేస్తున్న బీజేపీ పాలకులకు కట్టుబానిసలుగా వ్యవహరిస్తున్న అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామిని, ఏఎంఎంకే నేత దినకరన్‌ను ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ పిలుపునిచ్చారు.

ఈపీఎస్, దినకరన్ బీజేపీకి బానిసలు
CM Stalin, DMK,

  • వారిని ఓడించాల్సిందే

  • ఆండిపట్టి సభలో స్టాలిన్‌ పిలుపు

చెన్నై: గత ఐదేళ్లుగా రాష్ట్రాభివృద్ధికి నిధులివ్వకుండా, రాష్ట్ర హక్కులను హరించివేస్తున్న బీజేపీ పాలకులకు కట్టుబానిసలుగా వ్యవహరిస్తున్న అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామిని, ఏఎంఎంకే నేత దినకరన్‌ను ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ పిలుపునిచ్చారు. తేని జిల్లా ఆండిపట్టిలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ.. ఈపీఎస్‌ అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో చేపట్టిన పథకాలు వివరించి ఓట్లడగకుండా తనను వ్యక్తిగతంగా విమర్శించడమే ఆనవాయితీగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


గత ఐదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ పాలకులు రాష్ట్రంలో కీలకమైన పథకాలకు అనుమతిగానీ, నిధులుగానీ ఇవ్వలేదని ఆరోపించారు. మదురై, తిరుచ్చి, కోవై నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టు అమలుకు అనుమతివ్వలేదని, చెన్నైలో రెండో విడత మెట్రో రైలు ప్రాజెక్టుకు నిధులు నిలిపివేసిందని, హోసూరు విమానాశ్రయానికి అనుమతించలేదని, జలజీవన్‌ పథకాన్ని పటిష్ఠంగా అమలు చేస్తే దానికి కూడా నిధులు విడుదల చేయలేదన్నారు. ఇలా రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్న బీజేపీతో ఈపీఎస్‌ పొత్తుపెట్టుకుని తమిళుల వ్యతిరేకిగా చరిత్రలో నిలిచిపోయారన్నారు.


nani4.jpgతమిళభాష, తమిళ జాతి, తమిళనాడు అనే పదాలు వింటేనే మండిపడే గుంపుతో ఈపీఎస్‌ పొత్తు పెట్టుకున్నారన్నారు. ఈపీఎ్‌సతో పొత్తుపెట్టుకోవడం కన్నా ఉరేసుకోవటం మేలని చెప్పిన దినకరన్‌.. ఇప్పుడాయన వెంట తిరుగుతున్నారని స్టాలిన్‌ విమర్శించారు. దినకరన్‌ పాత చరిత్ర తిరిగేస్తే ఎన్నికల సంఘం ఉన్నతాధికారికే లంచం ఇచ్చిన ఘనత బయల్పడుతుందన్నారు. ఈ సభలో బోడినాయకనూర్‌ అభ్యర్థి ఒ.పన్నీర్‌సెల్వం, కంభం అభ్యర్థి కంభం రామకృష్ణన్‌, ఆండిపట్టి అభ్యర్థి మహారాజన్‌, పెరియకుళం డీపీఐ అభ్యర్థి శక్తివేల్‌ అలియాస్‌ ఆట్రల్‌ అరసుకు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

హీరో నచ్చితే విజిల్‌ కొట్టొచ్చు.. రాష్ట్రాన్నే అప్పగించగలమా?

ఇళ్ల ముందు ‘విజిల్‌’ ముగ్గులు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 18 , 2026 | 12:10 PM