Share News

2029 నుంచే మహిళా రిజర్వేషన్ అమలు కావాలని ఆశిద్దాం: కేంద్ర మంత్రి భూపతిరాజు

ABN , Publish Date - Apr 18 , 2026 | 11:52 AM

తెలుగు రాష్ట్రాల నేతలకు ఆంధ్ర నుంచి కేంద్రమంత్రిగా ఆతిథ్యం ఇచ్చానని.. ఇందులో ఎటువంటి రాజకీయ కోణం లేదని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు.

2029 నుంచే మహిళా రిజర్వేషన్ అమలు కావాలని ఆశిద్దాం: కేంద్ర మంత్రి భూపతిరాజు
Bhupathiraju Srinivasa Varma

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: తెలుగు రాష్ట్రాల నేతలకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఈరోజు(శనివారం) అల్పాహార విందు ఇచ్చారు. ఆంధ్ర నుంచి కేంద్ర మంత్రిగా తెలుగు రాష్ట్రాల నేతలకు ఆతిథ్యం ఇచ్చానని.. ఈ అల్పాహార విందులో ఎటువంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. డిసెంబర్ 9 నాటికి హైదరాబాద్ క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉండాలని ఈవీ బస్సులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారని తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపులు చేశామని.. త్వరలో అందజేస్తామని చెప్పారు. మహిళా రిజర్వేషన్ 2029 నుంచి అమలు చేసేందుకు ఒక ప్రయత్నం చేశామని.. కానీ విపక్షాలు వ్యతిరేకించాయన్నారు. 2029 నుంచే మహిళా రిజర్వేషన్ అమలు కావాలని ఆశిద్దామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు.


అల్పాహార విందుకు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కుమారస్వామి, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణంరాజు కూడా ఈ విందులో పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

కొండపల్లి కోట అభివృద్ధి దిశగా ప్రభుత్వం అడుగులు

రామలక్ష్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రకాశ్‌ రాజ్‌పై పరువు నష్టం దావా

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 18 , 2026 | 12:10 PM