పైకి నవ్వుతూ ఉన్నా.. లోలోపల ఏడుస్తూనే ఉన్నాం
ABN , Publish Date - Mar 27 , 2026 | 01:39 PM
డీఎంకే చిహ్నంపై పోటీ చేయాల్సి రావడం పట్ల ఎండీఎంకే నేత అర్జున్‌రాజ్ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. తమ చిహ్నంపై పోటీ చేయలేకపోవడం పట్ల తాము బయటకు నవ్వుతూనే వున్నా.. లోలోన ఏడుస్తున్నామన్నారు.
అర్జున్ రాజ్
చెన్నై: డీఎంకే చిహ్నంపై పోటీ చేయాల్సి రావడం పట్ల ఎండీఎంకే నేత అర్జున్‌రాజ్ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. తమ చిహ్నంపై పోటీ చేయలేకపోవడం పట్ల తాము బయటకు నవ్వుతూనే వున్నా.. లోలోన ఏడుస్తున్నామన్నారు. గురువారం మధ్యాహ్నం డీఎంకే ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాలయానికి వెళ్లిన అర్జున్‌రాజ్.. తమ అభ్యర్థుల జాబితా సమర్పించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎండీఎంకేకు నాలుగు సీట్లు లభించినప్పటికీ పార్టీ సొంత గుర్తు బొంగరం చిహ్నంపై పోటీ చేయలేని పరిస్థితి రావడంతో పైపైకి నవ్వుతూ లోలోపల ఏడుస్తున్నామని చెబుతూ ‘సిలర్ సిరిప్పార్ సిలర్ అళువార్... నాన్ సిరిత్తుకొండే అళుగిండ్రేన్’ అంటూ పాత సినిమాలో శివాజీగణేశన్ పాటందుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదు
గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News