Share News

2 నుంచి స్టాలిన్‌ ప్రచారం

ABN , Publish Date - Mar 27 , 2026 | 12:38 PM

అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, సెక్యూలర్‌ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో ప్రచారం చేస్తారని డీఎంకే ప్రధాన కార్యాలయం గురువారం ప్రకటించింది.

2 నుంచి స్టాలిన్‌ ప్రచారం

చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, సెక్యూలర్‌ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో ప్రచారం చేస్తారని డీఎంకే ప్రధాన కార్యాలయం గురువారం ప్రకటించింది. ఏప్రిల్‌ 23న అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో నామినేషన్‌ ప్రక్రియ ఈ నెల 30న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, అధికార డీఎంకే, ప్రతిపక్షం అన్నాడీఎంకే, నామ్‌ తమిళర్‌ కట్చి, టీవీకే మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది.


ఇక రాష్ట్రప్రజలను ఆకట్టుకునే విధంగా మళ్లీ ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలతో ప్రచారం జేయనున్నారు. మరో రెండు రోజుల్లో డీఎంకే అభ్యర్థుల జాబితాతో ఎన్నికల మేనిఫెస్టో కూడా సీఎం స్టాలిన్‌ విడుదల చేసే అవకాశముంది. ఇదిలా వుండగా, కూటమి పార్టీలకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా సీఎం పర్యటించే టైం టేబుల్‌ను అన్నా అరివాలయం విడుదల చేసింది. అందులోని వివరాల ప్రకారం ఏప్రిల్‌ 2వ తేదీ సాయంత్రం తిరువారూర్‌,


nani1.3.jpg3న ఉదయం జయంకొండామ్‌, సాయంత్రం తిరువెలుంబూరు, 4, 5, 6వ తేదీల్లో కరూర్‌, తిరుప్పూర్‌ ప్రాంతాల్ల ప్రచారం చేసి చివరగా కొళత్తూరు నియోజకవర్గంలో ఏప్రిల్‌ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం తన ప్రచారాన్ని పూర్తిచేయనున్నారు. అధినేత ప్రచార పర్యటన, బహిరంగ సభల నిర్వహణకు డీఎంకే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే మిత్రపక్షాల నేతలు ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ కొరత లేదు

గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు ఎలా ఉన్నాయంటే..

Read Latest Telangana News and National News

Updated Date - Mar 27 , 2026 | 12:42 PM