Share News

శ్రీరాముడు ధర్మానికి.. సీతమ్మ పవిత్రతకు ప్రతీక: తెలంగాణ గవర్నర్

ABN , Publish Date - Mar 27 , 2026 | 01:14 PM

శ్రీరాముడు ధర్మానికి.. సీతమ్మ తల్లి పవిత్రతకు ప్రతీక అని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అభివర్ణించారు. భారతీయ సంస్కృతిలో రామాయణం విశిష్టమైనదని తెలిపారు.

శ్రీరాముడు ధర్మానికి.. సీతమ్మ పవిత్రతకు ప్రతీక: తెలంగాణ గవర్నర్
TG Governor Siva pratap shukla

హైదరాబాద్, మార్చి 27: శ్రీరాముడు ధర్మానికి.. సీతమ్మ తల్లి పవిత్రతకు ప్రతీక అని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అభివర్ణించారు. భారతీయ సంస్కృతిలో రామాయణం విశిష్టమైనదని తెలిపారు. రామాయణంలో ఆదర్శ పుత్రుడు, భర్త, పురుషుడిగా నిలబడిన శ్రీరాముడిని స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్బంగా ప్రజలకు ఆయన సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సీతారాంబాగ్‌ ఆలయం వద్ద శ్రీరామ శోభయాత్రను గవర్నర్ జెండా ఊపి ప్రారంభించారు.


అనంతరం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి నగరంలో శ్రీరామ శోభాయాత్ర, కల్యాణోత్సవం విశేషంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. శోభాయాత్ర భక్తుల ఐకమత్యానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. శోభాయాత్రలో పాల్గొనే భక్తుల ఆధ్యాత్మికత ఉత్సాహం.. నగర వాతావరణాన్ని ఆధ్యాత్మిక భావనలో నిలుపుతుందని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చెప్పారు.


సీతారాంబాగ్‌లో ప్రారంభమైన శ్రీరామ శోభాయాత్ర రాత్రి 10 గంటలకు సూల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాల వద్ద ముగస్తుంది. ఈ శోభాయాత్ర జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇప్పటికే నగర సీపీ సజ్జనార్ తెలిపారు. దాదాపు 3 వేల మందితో పటిష్టమైన బందోబస్తు మధ్య ఈ యాత్ర సాగనుంది. దాదాపు లక్ష మంది భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొనున్నారు. ఈ యాత్ర సాగే ప్రాంతంలో సీసీ టీవీ కెమెరాలు, డ్రోన్ల పహరాలో ఈ యాత్ర కొనసాగుతోంది.

Updated Date - Mar 27 , 2026 | 01:19 PM