Share News

మహిళాలోకాన్ని కించపరిస్తే అంతే!

ABN , Publish Date - Mar 20 , 2026 | 01:49 PM

గత ఐదేళ్ల డీఎంకే పాలనలో మహిళలకు భద్రతలేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడీఎంకే ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాల్లో ముగ్గురు మాజీమంత్రులు మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్నారు.

మహిళాలోకాన్ని కించపరిస్తే అంతే!

  • అన్నాడీఎంకే నేతల కటౌట్లకు చెప్పులదండ

చెన్నై: గత ఐదేళ్ల డీఎంకే పాలనలో మహిళలకు భద్రతలేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడీఎంకే ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాల్లో ముగ్గురు మాజీమంత్రులు మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. దీంతో పొల్లాచ్చి బస్‌ స్టేషన్‌ వద్ద వారి కటౌట్లను ఏర్పాటు చేసి చెప్పుల దండలు వేశారు. బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ కటౌట్లు ఏర్పాట్లు చేశారని స్థానికులు చెబుతున్నారు. విల్లుపురం ధర్నాలో మాజీమంత్రి, రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం సీఎం స్టాలిన్‌ అమలు చేసిన మీ కలలు నెరవేరుద్దాం’ అనే పథకాన్ని విమర్శిస్తూ సినీనటి నయనతార(Nayanathara) కావాలని అడిగితే తన కోరిక నెరవేర్చగలరా అంటూ నోరు జారారు.


ఇదే విధంగా దిండుగల్‌ ధర్నాలో మాజీ మంత్రి దిండుగల్‌ శీనివాసన్‌, కరూర్‌లో జరిగిన ధర్నాలో మరో మాజీ మంత్రి ఎంఆర్‌ విజయభాస్కర్‌ ప్రభుత్వ పథకాలను విమర్శి స్తూ మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ముగ్గురి తీరుపట్ల విమర్శలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పొల్లాచ్చి బస్‌స్టేషన్‌ వద్ద ఆ నేతల కటౌట్లను ఏర్పాటు చేసి వాటికి చెప్పుల దండను వేసి, లంగాను తొడిగి వెళ్ళిపోయారు.


ఈ వార్తలు కూడా చదవండి:

డీఎంకేలోకి నటి రంజనా నాచ్చియార్‌

ఆదవ్‌ అర్జున్‌ ఎవరో తెలీదు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 20 , 2026 | 01:49 PM