Share News

పెరంబూర్‌ నుంచి విజయ్‌ పోటీ

ABN , Publish Date - Mar 25 , 2026 | 11:52 AM

‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ పెరంబూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.

పెరంబూర్‌ నుంచి విజయ్‌ పోటీ

  • నేటినుంచి ప్రచారం

  • కొడుంగైయూర్‌లో భవనం కొనుగోలు..?

చెన్నై: ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ పెరంబూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. వేళచ్చేరి, విరుగంబాక్కం, విరుదాచలం వంటి నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ముందుగా ఆయన భావించినా, చివరికి పెరంబూర్‌ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆ మేరకు ఆయన సన్నాహాలు చేసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే బుధవారం నుంచి ఆయన ఆ నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.


nani1.jpgఇదిలా ఉండగా నియోజకవర్గంలోనే ఉంటూ ప్రచారం చేపట్టాలని విజయ్‌ నిర్ణయించారు. అందుకోసం కొడుంగైయూర్‌ కృష్ణమూర్తి నగర్‌ జవహర్‌ వీధిలో ఓ భవనాన్ని విజయ్‌ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ బంగ్లాను విజయ్‌ బసతో పాటు పెరంబూర్‌ నియోజకవర్గం ఎన్నికల కార్యాలయంగా వినియోగించాలని కూడా భావిస్తున్నట్లు తెలిసింది. పెరంబూర్‌లో ప్రచారంలో పాల్గొననున్న విజయ్‌, బుధవారం కొత్త భవనంలో పూజలు నిర్వహించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

ఓఆర్‌ఆర్‌ చుట్టూ ఆధునిక బస్టాండ్లు, టెర్మినళ్లు

నేటి నుంచి భగభగలే!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 25 , 2026 | 11:59 AM