Share News

జోరుగా పాఠ్యపుస్తకాల దందా..

ABN , Publish Date - Jun 30 , 2026 | 01:09 PM

ప్రైవేటు పాఠశాలల్లో విద్యతోపాటు ఇతరత్రా వ్యాపారం జోరుగా సాగుతోంది.

జోరుగా పాఠ్యపుస్తకాల దందా..
Private Schools, Books

  • దుకాణుదారులతో ప్రైవేటు యాజమాన్యాల కుమ్మక్కు

  • నేరుగా పాఠశాలల్లోనే విక్రయాలు

  • ప్రైవేటు పబ్లిషర్స్‌ అడ్డగోలు వసూలు

  • పట్టించుకోని విద్యాశాఖ అధికారులు

మంచిర్యాల: ప్రైవేటు పాఠశాలల్లో విద్యతోపాటు ఇతరత్రా వ్యాపారం జోరుగా సాగుతోంది. యూనిఫాంలు, నోటు పుస్తకాలు, సాక్సుల వ్యాపారం చేస్తూ దొరికనంత దండుకుంటున్న యాజమాన్యాలు ఏకంగా ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్‌ విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. దుకాణాల యాజమాన్యాలతో కుమ్మక్కయిన ప్రైవేటు స్కూళ్ల నిర్వాహకులు కమీషన్ల కోసం పాఠశాలల్లోనే కౌంటర్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు పుస్తకాలు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పూర్తి ఉచితంగా పాఠ్య పుస్తకాల పంపిణీ జరుగుతుం డగా, ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.


అధిక ధరలకు పుస్తకాల విక్రయం...

ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ప్రభుత్వం రూపొందించిన పా ఠ్యపుస్తకాలను సైతం ఎమ్మా ర్పీ ధరలకే విక్రయించాలి. అయితే ప్రైవేటు స్కూళ్ల యా జమాన్యాలు మాత్రం వాటిని రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. షాపు యజమానుల ప్రోత్సాహంతో పాఠశాలల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి అక్కడే కొనాలని పోషకులపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పాఠ్యపుస్తకాలు, నోటు బు క్కులు, యూనిఫాంలు, సాక్సులు తదితర సామగ్రి మొత్తం తమ దగ్గర కొంటేనే చెల్లుబాటు అవుతాయని చెబుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థుల పోషకులు యాజమాన్యాలు నిర్ణయించిన ధరలు చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నారు. ఎల్‌కేజీ విద్యార్థి కోసం సామగ్రి కొనుగోలు చేసేందుకు ఒక్కరికి రూ. 10 వేల నుంచి 12వేల వరకు యాజమాన్యాలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.


లైసెన్స్‌ లేకున్నా ..

ప్రైవేటు పాఠశాలలకు అవసరమైన ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు విక్రయించాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి లైసెన్స్‌ పొంది ఉండాలనే నిబంధన ఉంది. అలా లైసెన్స్‌ పొందిన దుకాణాల యజమానులు ముందస్తుగా డీడీ తీయడం ద్వారా పాఠ్య పుస్తకాలను తమ షాపుల్లో నిల్వ ఉంచడంతోపాటు విక్రయాలు సాగించేందుకు అనుమతులు ఉంటాయి. ఈ ఏడాది జిల్లా విద్యాశాఖ అధికారులు సకాలంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంలో జాప్యం కారణంగా ఇప్పటి వరకు ఎవరికీ విక్రయ అనుమతులు లభించలేదు. అయినప్పటికీ జిల్లా కేంద్రంతోపాటు కొన్ని సెంటర్లలోని బుక్‌ స్టాల్స్‌లో పాఠ్య పుస్తకాలు లభ్యం అవుతుండటం గమనార్హం.


mncl1.jpgఅలా అక్రమంగా పాఠ్యపుస్తకాలు నిలువ ఉంచడమేగాక ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో కుమ్మ క్కై అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పైగా ప్రైవేటు పాఠశాలలకు సరఫరా అయ్యే పుస్తకాలను ఎంఆర్‌పీ ధరలకే విక్రయించాలనే నిబంధన ఉంది. దాన్ని తుంగలో తొక్కుతూ అధిక ధరలకు విక్రయాలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై విద్యాశాఖ అధికారులతోపాటు, కలెక్టర్‌కు సైతం ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.


ఎలాంటి అనుమతులు లేకుండా పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న దుకాణాలపై త్వర లో చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్లు తెలు స్తోంది. ఇదిలా ఉండగా, తమవద్ద పాఠ్యపుస్తకాలు కొనుగోలు చేసే ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులకు గరిష్టంగా 40 శాతం వరకు దుకాణుదారులు కమీషన్లు ఇస్తున్నట్లు సమాచారం. అలా సగం ధరలకే పుస్తకాలు కొనుగోలు చే స్తున్న పాఠశాలల నిర్వాహకులు.. విద్యార్థుల తల్లిదండ్రులకు మాత్రం రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలా విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీకి గురి చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


jgl2.jpgవిద్యార్థి సంఘాల ఫిర్యాదు....

కాగా ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వ పాఠ్యపుస్తకాల వి క్రయాలపై పలువురు విద్యార్థి సంఘాల నాయకులు ఇప్పటికే విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో అక్రమంగా పాఠ్య పుస్తకాలు విక్రయస్తు న్నారన్న సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించిన వి ద్యార్థి సంఘాల నాయకులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని వి ద్యాశాఖ అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దీంతో ఆయా దుకాణాలు, పాఠ శాలలపై ఉన్నతాధికారులు ధృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రై వేటు పాఠశాలల్లో పుస్తకాల విక్రయ దందాను విద్యా శా ఖ అధికారులు అరికట్టాలనే డిమాండ్‌లు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకుల నుంచి వినిపిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

భూపాలపల్లి జిల్లాలో లోటు వర్షపాతం

జులై 1 నుంచి ఐఐఐటీ జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 30 , 2026 | 01:09 PM