Share News

జూన్ 28న గీతం అడ్మిషన్ టెస్ట్.. యూజీ, పీజీ కోర్సుల ప్రవేశాల కోసం పూర్తి వివరాలివే..

ABN , Publish Date - Jun 23 , 2026 | 01:18 PM

ప్రముఖ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం 2026 విద్యా సంవత్సరానికి గానూ యూజీ, పీజీ కోర్సుల ప్రవేశాల కోసం జాతీయ స్థాయి అర్హత పరీక్ష ‘గ్యాట్-2026’ డ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను గీతం యాజమాన్యం వెల్లడించింది.

జూన్ 28న గీతం అడ్మిషన్ టెస్ట్.. యూజీ, పీజీ కోర్సుల ప్రవేశాల కోసం పూర్తి వివరాలివే..
GITAM Admission Test 2026

విశాఖపట్నం, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం (GITAM) 2026 విద్యా సంవత్సరానికి గానూ యూజీ, పీజీ కోర్సుల ప్రవేశాల కోసం జాతీయ స్థాయి అర్హత పరీక్ష ‘గ్యాట్-2026’ (GAT-2026) షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను గీతం యాజమాన్యం వెల్లడించింది.


‘గ్యాట్-2026’ ముఖ్యమైన తేదీలు, మినహాయింపులివే..

దరఖాస్తుల స్వీకరణ: జూన్ 26, 2026 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష నిర్వహణ: జూన్ 28, 2026న దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఈ పరీక్ష జరగనుంది.

పరీక్ష నుంచి మినహాయింపు: జేఈఈ (JEE), సీయూఈటీ (CUET), క్యాట్ (CAT) వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ మెరిట్, ర్యాంకు సాధించిన విద్యార్థులకు గ్యాట్ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. వారు నేరుగా ప్రవేశాలు పొందవచ్చు.


100 శాతం వరకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు

విద్యార్థులను ప్రోత్సహించేందుకు గీతం సంస్థ భారీగా స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది. గ్యాట్-2026తో పాటు ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో సాధించిన ప్రతిభ (మెరిట్) ఆధారంగా యూజీ, పీజీ విద్యార్థులకు 100 శాతం వరకు ఫీజు మినహాయింపు (మెరిట్ స్కాలర్‌షిప్) అందించనున్నారు.

కొత్త కోర్సులు, ఎన్ఐఆర్ఎఫ్ గుర్తింపులు

గీతం విశ్వవిద్యాలయానికి చెందిన ఫార్మసీ, మేనేజ్‌మెంట్ కోర్సులకు కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఎన్ఐఆర్ఎఫ్ (NIRF) గుర్తింపు లభించింది.

లిబరల్ ఎడ్యుకేషన్:

విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకునే వీలుగా గీతం పరిధిలోని మూడు క్యాంపస్‌లలో 'లిబరల్ ఎడ్యుకేషన్' విధానాన్ని అమలు చేస్తున్నారు.


హైదరాబాద్‌లో 4 ఏళ్ల బీఈడ్ కోర్సు:

ఈ విద్యా సంవత్సరం (2026) నుంచి గీతం హైదరాబాద్ క్యాంపస్‌లో సరికొత్తగా 4 సంవత్సరాల బీఈడ్ (BEd) కోర్సును ప్రారంభిస్తున్నారు.

క్వాంటమ్ టీచింగ్ ల్యాబ్:

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన 'క్వాంటమ్ టీచింగ్ ల్యాబ్'ను క్యాంపస్‌లో ఏర్పాటు చేశారు.

ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ స్కాలర్‌షిప్‌లు

సమాజానికి సేవలందిస్తున్న విభాగాల కోసం గీతం యాజమాన్యం ప్రత్యేక స్కాలర్‌షిప్‌లను కేటాయించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు ప్రత్యేక రాయితీలు ఉంటాయి. భారత నౌకాదళం (Indian Navy), సీఆర్పీఎఫ్ (CRPF), భారత వైమానిక దళం (Indian Air Force) సిబ్బంది పిల్లలు, కుటుంబాలకు ప్రత్యేక 'పబ్లిక్ సర్వీస్ స్కాలర్‌షిప్‌లు' అందించనున్నట్లు సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.

వెబ్‌సైట్‌‌లో వివరాలు..

అర్హత, ఆసక్తి గల విద్యార్థులు మరిన్ని వివరాల కోసం గీతం విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌ను https://www.gitam.edu/ లింక్ ద్వారా సందర్శించి జూన్ 26వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని యాజమాన్యం సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి...

ABN ఎఫెక్ట్.. ఇంద్రకీలాద్రి నకిలీ టికెట్లపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశం

నెల్లూరు ఏఎస్‌పేట దర్గా వివాదం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.. వక్ఫ్‌కు లేఖ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 23 , 2026 | 01:34 PM