వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే?
ABN , Publish Date - Oct 18 , 2026 | 07:03 AM
వారఫలాలు.. 18 - 24 అక్టోబర్ 2026, పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. సమయస్ఫూర్తితో మెలుగుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. అప్రమత్తంగా ఉండాలి. పనులు, బాధ్యతలు పురమాయించ వద్దు. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాప్యం తగదు. కుటుంబసౌఖ్యం పొందుతారు. ఆత్మీయులను కలుసుకుంటారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు
లావాదేవీల్లో మెలకువ వహించండి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. నిపుణుల సలహా పాటించండి. భేషజాలకు పోవద్దు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. శుభలేఖ అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. మొండిధైర్యంతో వ్యవహరి స్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ముఖ్యమైన పనులు స్వయంగా చూసుకోండి. బంధువుల రాక ఇబ్బంది కలిగి స్తుంది. ప్రశాంతంగా ఉండటానికి యత్నిం చండి. మీ తప్పిదాలు సరిదిద్దుకోవటం శ్రేయ స్కరం. చిన్న విషయానికే చికాకుపడతారు. పిల్లల భవిష్యత్తుపై దృష్టిపెట్టండి. వాహనదారులకు దూకుడు తగదు.
కర్కాటకం
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అన్నిరంగాల వారికీ యోగ దాయకం. కార్యసిద్థి, వ్యవహారజయం ఉన్నాయి. శ్రమకు తగిన ప్రతిఫలం అందు తుంది. ప్రముఖులను ఆకట్టుకుంటారు. ఖర్చులు అధికం, ధనానికి ఇబ్బంది ఉండదు. వాయిదాపడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. మీ వ్యాఖ్యలను కొందరు తప్పుపడతారు. పెద్దల జోక్యంతో వివాదం సద్దుమణుగుతుంది. కుటుంబీకుల గురించి ఆందోళన చెందుతారు.
సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. లక్ష్యానికి చేరువవుతారు. ఓర్పుతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. పరిస్థితులు అనుకూలి స్తాయి. అర్థాంతరంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉం డదు. అనవసర విషయాల జోలికి పోవద్దు. నోటీసులు అందుతాయి. నిపుణులను సంప్రదించండి. ఏకపక్ష నిర్ణయం తగదు.
కన్య
ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. రావలసిన ధనం అందుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు స్థిమితంగాపూర్తి చేస్తారు. నగదు డ్రా చేేసటపుడు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. తరచూ సన్ని హితులతో సంభాషిస్తుంటారు. తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ముఖ్యులను కలుసుకుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు.
తుల
చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
ధైర్యంగా ముందుకు సాగు తారు. కొన్ని అవకాశాలు అనుకోకుండా కలిసివస్తాయి. ఆదాయం సంతృప్తికరం. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం సంతృప్తికరం. ప్రకటనలు, ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. విదేశాల్లోని ఆత్మీయులతో సంభాషిస్తారు.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
వ్యవహారపరిజ్ఞానంతో రాణి స్తారు. పరిస్థితులు మెరుగుపడతాయి. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు ముందుకు సాగవు.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
నిర్విరామంగా శ్రమిస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సన్నిహితులతో సంభాషిస్తుంటారు. ప్రశాం తంగా ఉండటానికి యత్నించండి. ఏ విష యాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. పరి స్థితులు నిదానంగా చక్కబడతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుం టారు. చెల్లింపులను అశ్రద్ధ చేయకండి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. సావకాశంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రాగల్గుతారు. స్థిరచరాస్తి ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. శుభలేఖ అందుకుంటారు. పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబీకులతో కాలక్షేపం చేస్తారు. ఒక సంఘటన మీపై ప్రభావం చూపుతుంది. పోగొట్టుకున్న నగదు, వస్తువులు లభ్యమవుతాయి. బెట్టింగ్ల జోలికిపోవద్దు.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
తలపెట్టిన కార్యం నెరవేరు తుంది. ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. సంప్రదిం పులు ఫలిస్తాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. కొత్తపనులు చేపడతారు. ఖర్చులు విపరీతం. కొన్ని అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. బాధ్యతలు అప్పగించవద్దు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు.
మీనం
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
కార్యసిద్ధి, వ్యవహారజయం ఉన్నాయి. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. గృహమార్పు అని వార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
ఆర్టీసీ ఉద్యోగులకు పండుగ అడ్వాన్సు
Read Latest AP News And Telangana News And International News And Telugu News