ఆరు బైకులతో డేంజరస్ స్టంట్.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం..
ABN , Publish Date - Oct 16 , 2026 | 03:10 PM
సోషల్ మీడియాలో ఒక్క వీడియోతో పాపులర్ కావాలనే ఆరాటం కొందరిని ప్రమాదకరమైన విన్యాసాల వైపు నడిపిస్తోంది. వ్యూస్, లైకుల కోసం ప్రాణాలను పణంగా పెట్టి స్టంట్లు చేస్తూ ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. ఓ వ్యక్తి ఆరు బైకులతో ప్రమాదకర స్టంట్ ఇప్పుడు సోషలక మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో పాపులర్ కావాలనే తాపత్రయంతో ఈ మధ్యకాలంలో చాలామంది ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎక్కువ లైకులు, వ్యూస్, ఫాలోవర్ల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఇలాంటి విన్యాసాలు చివరకు తీవ్ర ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఆరు బైకులతో ఓ వ్యక్తి చేసిన ప్రమాదకరమైన స్టంట్ చివరకు ప్రాణాల మీదకు తెచ్చింది. అతడి మెడ, శరీరానికి తాళ్లు కట్టి, వాటిని ఆరు బైకులతో అటూ.. ఇటూ లాగడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. బైకులు వేగం పెంచడంతో తాళ్లు బిగుసుకుపోయి.. ఆ వ్యక్తి ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే అతడి వద్దకు చేరుకుని తాళ్ల నుంచి విడిపించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ వీడియో @ripper_dhruvaa అనే యూజర్ ఎక్స్లో ట్వీట్ పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘జనాలను ఆకట్టుకోవడం కోసం ఇలాంటి ప్రాణాంతక విన్యాసాలు చేయడం ఎంతవరకు సమంజసం’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ‘కనీస భద్రతా చర్యలు పాటించకుండా ఇలాంటి స్టంట్లు చేయడం వల్ల ప్రాణాలకే ముప్పు’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ‘సరదా కోసం చేసే విన్యాసాలు ఒక్కోసారి విషాదానికి దారితీస్తాయి’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. మరికొంతమంది నెటిజన్లు ఇలాంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే.. ఈ ఘటన ఎక్కడ జరిగింది, స్టంట్ చేస్తున్న వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే వివరాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
ఇవి కూడా చదవండి...
పిల్లలకు విద్యాబుద్ధులు ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుంటున్నా: మంత్రి లోకేశ్
సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News