సీఎం రేవంత్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
ABN , Publish Date - Oct 18 , 2026 | 06:38 AM
సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ ఆడబిడ్డలకు శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ ఆడబిడ్డలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు, ఆడబిడ్డల ఆరాధనకు బతుకమ్మ నిలువెత్తు నిదర్శనమన్నారు. తీరొక్క పూలతో, ఘనమైన బతుకమ్మలతో ఆడబిడ్డలంతా ఆటపాటలతో సద్దుల బతుకమ్మ సంబురాలను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పండుగ వేళ ప్రతి ఇంటా సిరిసంపదలు, సుఖశాంతులు వెల్లివిరియాలన్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు మాజీ సీఎం కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
మూడోవంతు విద్యుత్ జెన్కో నుంచే...
అవసరమైతే కోమటిరెడ్డి కోసం తల నరుక్కుంటా..
క్యూనెట్ కేసు కీలక నిందితుడు డిగ్ విజయ్సింగ్ అరెస్టు
Read Latest AP News And Telangana News And International