Share News

అవసరమైతే కోమటిరెడ్డి కోసం తల నరుక్కుంటా..

ABN , Publish Date - Oct 18 , 2026 | 06:26 AM

‘‘అవసరమైతే మంత్రి కోమటిరెడ్డి కోసం తల నరుక్కుంటా.. అంతేకానీ పాలమూరుకు అన్యాయం చేస్తే మాత్రం ఊర్కోను. పాలమూరుకు నీరిచ్చిన తర్వాతనే డిండి గురించి ఆలోచించాలి’’ అని జడ్చర్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు.

అవసరమైతే కోమటిరెడ్డి కోసం తల నరుక్కుంటా..
Anirudh Reddy

  • పాలమూరుకు అన్యాయం చేస్తే ఊర్కోను

  • పాలమూరుకు నీరిచ్చిన తర్వాతే డిండి గురించి ఆలోచించాలి: అనిరుధ్‌రెడ్డి

జడ్చర్ల/కల్వకుర్తి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ‘‘అవసరమైతే మంత్రి కోమటిరెడ్డి కోసం తల నరుక్కుంటా.. అంతేకానీ పాలమూరుకు అన్యాయం చేస్తే మాత్రం ఊర్కోను. పాలమూరుకు నీరిచ్చిన తర్వాతనే డిండి గురించి ఆలోచించాలి’’ అని జడ్చర్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్‌ నుంచి గొట్టిముక్కలకు నీటిని తరలించాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 60ు మాత్రమే జరిగాయని పేర్కొన్నారు.


ఏదుల రిజర్వాయర్‌ నుంచి డిండి ప్రాజెక్టుకు నీటిని తరలిస్తామని అసెంబ్లీ సాక్షిగా నాడు కేసీఆర్‌ చెప్పారని, ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఈ అంశంపై రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకెళ్తామంటే సహించేదిలేదని ఆయన అన్నారు. పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని, ఏదుల నుంచి డిండి ప్రాజెక్టుకు నీటిని తరలించొద్దని బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, జేఏసీ నేతలు రాజేందర్‌రెడ్డి, రాఘవాచారి డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

మూడోవంతు విద్యుత్‌ జెన్‌కో నుంచే...

కీసర మాజీ సీఐ కోటీశ్వరుడే!

క్యూనెట్‌ కేసు కీలక నిందితుడు డిగ్‌ విజయ్‌సింగ్‌ అరెస్టు

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 18 , 2026 | 06:26 AM