Share News

మూడోవంతు విద్యుత్‌ జెన్‌కో నుంచే...

ABN , Publish Date - Oct 18 , 2026 | 06:19 AM

రాష్ట్ర విద్యుత్‌ అవసరాల్లో మూడోవంతుకుపైగా (36 శాతం) తాము తీరుస్తున్నామని తెలంగాణ జెన్‌కో పేర్కొంది.

మూడోవంతు విద్యుత్‌ జెన్‌కో నుంచే...
Telangana GENCO

  • రాష్ట్రంలో కరెంటు వినియోగం 325 మిలియన్‌ యూనిట్లు

  • జెన్‌కో కేంద్రాల నుంచి 115 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి

  • సీఎం రేవంత్‌రెడ్డికి జెన్‌కో సీఎండీ నివేదిక

హైదరాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యుత్‌ అవసరాల్లో మూడోవంతుకుపైగా (36 శాతం) తాము తీరుస్తున్నామని తెలంగాణ జెన్‌కో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం 325 మిలియన్‌ యూనిట్లు కాగా, దాంట్లో 115 మిలియన్‌ యూనిట్లకు పైగా జెన్‌కో కేంద్రాలు అందిస్తున్నాయని తెలిపింది. సింగరేణి 25 మిలియన్‌ యూనిట్లను, కేంద్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు 64 మిలియన్‌ యూనిట్లను అందిస్తుండగా, మిగిలిన విద్యుత్‌ను బయటి నుంచి కొంటున్న సంగతిని గుర్తు చేసింది. ఈ మేరకు జెన్‌కో పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆ సంస్థ సీఎండీ డాక్టర్‌ ఎస్‌ హరీశ్‌ ఒక నివేదిక సమర్పించారు.


ఆ నివేదికలో ఉన్న ముఖ్యాంశాలు.. 2024 మార్చి 31 నాటికి 6,485.26 మెగావాట్లుగా ఉన్న జెన్‌కో స్థాపిత విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం ఈ ఏడాది జూలై 31 నాటికి 9,624.96 మెగావాట్లకు పెరిగింది. ఇందులో థర్మల్‌ విద్యుత్‌ వాటా 7,180 మెగావాట్లు, జలవిద్యుత్‌ వాటా 2,441.76 మెగావాట్లు, సౌర విద్యుత్‌ వాటా 3.2 మెగావాట్లు. 2024-25లో 26,960.18 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరిగింది. 2025-26లో ఇది 32,568.89 మిలియన్‌ యూనిట్లకు పెరిగింది. 2025-26లో 6,912.42 మిలియన్‌ యూనిట్ల జలవిద్యుత్‌ ఉత్పత్తి జరిగింది. నిర్దేశిత లక్ష్యం 3,931.69 మిలియన్‌ యూనిట్లతో పోలిస్తే ఇది దాదాపు 3 వేల మిలియన్‌ యూనిట్లు అధికం.


విద్యుత్‌ డిమాండ్‌ @ 20,018 మెగావాట్లు

రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ రోజురోజుకూ పెరుగుతోంది. గతంలో నమోదైన రికార్డులను అధిగమిస్తూ సరికొత్త గరిష్ఠ స్థాయిలకు చేరుతోంది. ఈనెల 15వ తేదీన 20,003 మెగావాట్లుగా నమోదైన విద్యుత్‌ డిమాండ్‌.. 16వ తేదీ ఉదయం 10:41 గంటలకు ఏకంగా 20,018 మెగావాట్లకు చేరింది.


ఈ వార్తలు కూడా చదవండి

గోదావరి-కావేరీ లింకు పేరుతో కుట్ర:హరీశ్‌

కీసర మాజీ సీఐ కోటీశ్వరుడే!

క్యూనెట్‌ కేసు కీలక నిందితుడు డిగ్‌ విజయ్‌సింగ్‌ అరెస్టు

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 18 , 2026 | 06:19 AM