Share News

గోదావరి-కావేరీ లింకు పేరుతో కుట్ర:హరీశ్‌

ABN , Publish Date - Oct 18 , 2026 | 05:58 AM

గోదావరి-కావేరీ లింకు పేరుతో తెలంగాణపై పెద్ద కుట్ర జరుగుతోందని, రాష్ట్ర నీటి హక్కులకు మరణశాసనం రాస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

గోదావరి-కావేరీ లింకు పేరుతో కుట్ర:హరీశ్‌
Harish Rao

గోదావరి-కావేరీ లింకు పేరుతో తెలంగాణపై పెద్ద కుట్ర జరుగుతోందని, రాష్ట్ర నీటి హక్కులకు మరణశాసనం రాస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కుట్రను అడ్డుకోవాల్సింది పోయి సీఎం రేవంత్‌ మద్దతు పలుకుతున్నారని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు అక్టోబరు 7న గోదావరి-కావేరీ లింకును పోలవరం నుంచి చేపట్టాలనే అంశాన్ని ఎజెండాలో చేర్చమని లేఖ రాయడంతో నవంబరు 3న సమావేశం పెడుతున్నారని తెలిపారు.


పోలవరం, బనకచర్ల లింకు ప్రాజెక్టుతో గోదావరి జలాలను అక్రమంగా ఏపీకి తరలించేందుకు విషకూటమిలా తయారయ్యారని హరీశ్‌ ఆరోపించారు. చత్తీ్‌సగడ్‌ వినియోగించని 148 టీఎంసీల నీటిని గోదావరి-కావేరీ లింకుకు వాడతామంటున్నారని, ఇందులో తెలంగాణకు 43, ఆంధ్రప్రదేశ్‌కు 44, తమిళనాడుకు 42.5, పుదుచ్చేరికి 2.5, కర్ణాటకకు 16 టీఎంసీల నీరు పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. ఈ నీరంతా ఏపీ తీసుకుపోతే తెలంగాణ పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి

పోలవరం.. పాలమూరు వేర్వేరు ప్రాజెక్టులు కాదు!

విద్యుత్‌ ఆదా, నీటి పొదుపుపై.. ప్రజాచైతన్యానికి సినీ హీరోలు కదలాలి

రాజ్యాంగ వ్యవస్థలను నీరు గారుస్తున్న బీజేపీ

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 18 , 2026 | 06:01 AM