విద్యుత్ ఆదా, నీటి పొదుపుపై.. ప్రజాచైతన్యానికి సినీ హీరోలు కదలాలి
ABN , Publish Date - Oct 18 , 2026 | 05:49 AM
సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ ఆదా, నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సినీ హీరోలు ముందుకు రావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
విజయ్ దేవరకొండలా వుుందుకురావాలి
బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్ చాలెంజ్ అవార్డుల ప్రదానోత్సవంలోడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపు
హైదరాబాద్ సిటీ, అక్టోబరు17(ఆంధ్రజ్యోతి): సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ ఆదా, నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సినీ హీరోలు ముందుకు రావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావాలు ప్రజలకు అర్థమయ్యేలా సినీ ప్రముఖులు, ఔత్సాహికులు సందేశాత్మక లఘుచిత్రాలు రూపొందించాలని కోరారు. తెలంగాణ ఫిల్మ్ డెవల్పమెంట్ కార్పొరేషన్(టీజీఎ్ఫడీసీ) ఆధ్వర్యంలో హైదరాబాద్లోని శిల్ప కళావేదికలో శనివారం జరిగిన బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డుల ప్రదానోత్సవానికి భట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ ఆదా, నీటి పొదుపుపై పభుత్వం విజ్ఞప్తి మేరకు విజయ్ దేవరకొండ సందేశం ఇచ్చారని, ఇతర కథానాయకులు కూడా విజయ్ దేవరకొండలా స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. తెలంగాణ యువతను ప్రోత్సహిస్తూ, హైదరాబాద్ను సినీ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కాగా, లఘచిత్రాలు, బతుకమ్మ పాటలు, జానపదగీతాలు, ఇన్ఫ్లుయెన్సర్లు, ఆర్టికల్స్... విభాగాల కింద దర్శకుడు హరీష్ శంకర్ నేతృత్వంలోని జ్యూరీ ఎంపిక చేసిన మొత్తం 29మంది విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. రామ్ తలైవి రూపొందించిన ‘యక్షగానం’ లఘుచిత్రానికి ప్రథమ బహుమతి కింద రూ.3లక్షలు, అభివన్ తీసిన ‘నా ఇంటి బతుకమ్మ’ కు ద్వితీయ బహుమతి కింద రూ.2లక్షలు, ప్రభు, రాజ్ రూపొందించిన ‘ఇల్లు వెలుగు’ లఘుచిత్రం తృతీయ బహుమతి కింద రూ.లక్ష బహుమతి గెలుచుకుంది.
తాగునీటి సమస్య రానివ్వం: మంత్రి సీతక్క
ఎల్నినో ప్రభావంతో పరిస్థితులు ఎలా ఉన్నా.. రాష్ట్ర ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టామని మంత్రి సీతక్క తెలిపారు. శనివారం ఆమె ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నవంబరు మొదటి వారంలో కలెక్టర్లతో కలిసి గ్రామీణ నీటిసరఫరా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. రెండో వారంలో తాగునీటి అవసరాలపై మండల స్థాయిలో అవగాహన సదస్సులు పెట్టాలని చెప్పారు. ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలని, పైపులైన్ల లీకేజీల విషయంలో అలసత్వం వద్దని హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
పోలవరం.. పాలమూరు వేర్వేరు ప్రాజెక్టులు కాదు!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: రాంచందర్రావు
కనిపించని శత్రువులతో యుద్ధం చేయాలి
Read Latest AP News And Telangana News And International