Share News

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: రాంచందర్‌రావు

ABN , Publish Date - Oct 18 , 2026 | 05:38 AM

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమాయత్తం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: రాంచందర్‌రావు
Ramchander Rao

హైదరాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమాయత్తం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికలు పూర్తయ్యే వరకూ క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలన్నారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావు అధ్యక్షతన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై సన్నాహక సమావేశం జరిగింది. ఎమ్మెల్సీలు ఏవీఎన్‌ రెడ్డి, మల్క కొమురయ్యలతో పాటు రెండు ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలు, ఇన్‌చార్జులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. అభ్యర్థి ఎవరన్న దానితో సంబంధం లేకుండా పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియపై ప్రతి ఒక్కరూ ప్ర త్యేక దృష్టి సారించాలని సూచించారు. పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించడంతో పాటు పోలింగ్‌ రోజున వారు ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా కార్యకర్తలు చొరవ చూపాలన్నారు. బీజేపీ పట్ల విద్యావంతులు, గ్రాడ్యుయేట్లలో బలమైన సానుకూలత ఉందన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

రోడ్డు భద్రత సెస్‌ లెక్క పక్కా

పల్లెకు పోదాం..పండగ చేద్దాం..

తోటి ఉద్యోగిని, విలేకరులు వేధిస్తున్నారని.. ఓ ఉద్యోగి ఆత్మహత్య

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 18 , 2026 | 05:38 AM