Share News

రోడ్డు భద్రత సెస్‌ లెక్క పక్కా

ABN , Publish Date - Oct 18 , 2026 | 05:34 AM

కొత్త వాహనాలపై వసూలు చేస్తున్న రోడ్డు భద్రత సెస్‌ నిధులు పక్కదారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టింది. జిల్లాల వారీగా ప్రతి రూపాయి ఆదాయ, వ్యయాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని,.

రోడ్డు భద్రత సెస్‌ లెక్క పక్కా
Telangana road safety cess

  • నిధులు పక్కదారి పట్టకుండా జిల్లాల వారీ ఖర్చులు ఆన్‌లైన్‌లో..

  • కలెక్టర్లకు ఆదేశాలు.. జీవో 48 జారీ

హైదరాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): కొత్త వాహనాలపై వసూలు చేస్తున్న రోడ్డు భద్రత సెస్‌ నిధులు పక్కదారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టింది. జిల్లాల వారీగా ప్రతి రూపాయి ఆదాయ, వ్యయాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని, ఈ నిధుల ఖాతాలపై కంప్ర్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ఆడిట్‌ తప్పనిసరిగా జరిగేలా చూడాలని ఆదేశించింది. ఈ మేరకు రవాణా, రహదారులు-భవనాల శాఖ జీవో నంబర్‌ 48 జారీ చేసింది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర, జిల్లా రోడ్డు భద్రత నిధుల నిర్వహ ణ, పర్యవేక్షణ జరగాలని ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది.


జిల్లా రోడ్డు భద్రత కమిటీల ఆదాయ, వ్యయాలు ఎప్పటికప్పుడు కనిపించేలా టీజీ ఆన్‌లైన్‌ అకౌంటింగ్‌ వ్యవస్థను అన్ని జిల్లాలకు విస్తరించాలని ఆదేశించింది. జిల్లా కలెక్టర్లు ఈ కమిటీలను తక్షణమే క్రియాశీలం చేయాలని, ఈ కమిటీలు ప్రతి నెలా క్రమం తప్పకుండా సమావేశమై ప్రమాదాల నివారణ చర్యలను సమీక్షించాలని పేర్కొంది. కాగా, తెలంగాణ మోటారు వాహనాల పన్నుల (సవరణ) చట్టం-2026 కింద వసూలైన రోడ్డు భద్రత సెస్‌ మొత్తం తెలంగాణ రహదారి భద్రత నిధికి జమవుతుంది. ఈ చట్టం మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో కొత్తగా రిజిస్టర్‌ అయ్యే వాహనాలపై ఒక్కసారి మాత్రమే సెస్‌ వసూలు చేస్తారు. ద్విచక్ర వాహనాలకు రూ.2 వేలు, కార్ల వంటి తేలికపాటి వాహనాలకు రూ.5 వేలు, ఇతర వాహనాలకు రూ.10 వేలు చొప్పున సెస్‌ ఉంది. దీని ద్వారా ఏటా సుమారు రూ.300 కోట్లు వస్తాయని అంచనా.


ఈ వార్తలు కూడా చదవండి

వినోదంలో పెను విషాదం

పల్లెకు పోదాం..పండగ చేద్దాం..

తోటి ఉద్యోగిని, విలేకరులు వేధిస్తున్నారని.. ఓ ఉద్యోగి ఆత్మహత్య

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 18 , 2026 | 05:34 AM