Share News

కనిపించని శత్రువులతో యుద్ధం చేయాలి

ABN , Publish Date - Oct 18 , 2026 | 05:42 AM

దేశంలో వామపక్ష తీవ్రవాదం సమస్యలు తగ్గినప్పటికీ రాబోయే రోజుల్లో మాదకద్రవ్యాలు, సైబర్‌క్రైం, ఉగ్రవాదం, అక్రమ వలసలు, డార్క్‌నెట్‌ ద్వారా సుపారీ హత్యలు, విదేశాలకు డబ్బు తరలింపు వంటివి ..

కనిపించని శత్రువులతో యుద్ధం చేయాలి
Union Home Secretary Govind Mohan

  • నేరాల తీరుకు అనుగుణంగా పోలీసింగ్‌ మారాలి

  • నూతన ఐపీఎస్‌లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి

  • 78వ బ్యాచ్‌ ఐపీఎస్‌ల దీక్షాంత్‌ పరేడ్‌కు హాజరు

హైదరాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): దేశంలో వామపక్ష తీవ్రవాదం సమస్యలు తగ్గినప్పటికీ రాబోయే రోజుల్లో మాదకద్రవ్యాలు, సైబర్‌క్రైం, ఉగ్రవాదం, అక్రమ వలసలు, డార్క్‌నెట్‌ ద్వారా సుపారీ హత్యలు, విదేశాలకు డబ్బు తరలింపు వంటివి పెను సవాళ్లుగా మారనున్నాయని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ అన్నారు. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు వంటి నేరాల కన్నా సైబర్‌క్రైం అత్యంత ప్రమాదకరంగా మారిందని, కంటికి కనిపించని నేరగాళ్లతో పోలీసులు యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. హైదరాబాద్‌లోని సర్ధార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీసు అకాడమీలో శనివారం జరిగిన 78వ బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారుల దీక్షాంత్‌ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు.


అనంతరం వివిధ సబ్జెక్టులో ప్రతిభ కనబరచిన ఐపీఎస్‌ ప్రోబేషనర్లకు ట్రోఫీలు అందజేసి, వారిని ఉద్దేశించి మాట్లాడారు. దేశంలోని అంతర్గత భద్రతలో గణనీయమైన మార్పులు వచ్చాయని, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాట్లు, స్వదేశీ, విదేశీ ఉగ్రవాద సమస్యలు ఎదుర్కోంటున్నామని తెలిపారు. దేశంలో మాదకద్రవ్యాల వినియోగం క్రమంగా విస్తరిస్తోందని, యువతను కాపాడుకుంటూ మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. 78వ బ్యాచ్‌లో మొత్తం 151 మంది ఐపీఎ్‌సలకు శిక్షణ ఇవ్వగా.. అందులో 135 మంది భారత్‌కు చెందినవారని, మిగతా వారు భూటాన్‌, మాల్దీవులు, నేపాల్‌ దేశాలకు చెందిన అధికారులని అకాడమీ డైరక్టర్‌ సుజిత్‌ పాండే తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

రోడ్డు భద్రత సెస్‌ లెక్క పక్కా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: రాంచందర్‌రావు

తోటి ఉద్యోగిని, విలేకరులు వేధిస్తున్నారని.. ఓ ఉద్యోగి ఆత్మహత్య

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 18 , 2026 | 05:42 AM