Share News

రాజ్యాంగ వ్యవస్థలను నీరు గారుస్తున్న బీజేపీ

ABN , Publish Date - Oct 18 , 2026 | 05:58 AM

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను నీరు గారుస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు.

రాజ్యాంగ వ్యవస్థలను నీరు గారుస్తున్న బీజేపీ
Mahesh Kumar Goud

  • ‘సర్‌’లో లౌకికవాదుల ఓట్ల తొలగింపు: మహేశ్‌ గౌడ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను నీరు గారుస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. విపత్కర పరిస్థితులెదురైనప్పుడల్లా విదేశీ అంశాలను ముందుకు తెచ్చి రాజకీయం చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ఏఐసీసీ ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ మధు యాష్కీ గౌడ్‌లతో కలిసి మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. దేశవ్యాప్తంగా లౌకికవాదులు, ముస్లింలు, పేదలు, ఆదివాసీల ఓట్లను కుట్ర పూరితంగా తొలగిస్తున్నారన్నారు.


ఒక్క తెలంగాణలోనే 27శాతం ఓట్లు తొలగించారన్నారు. మోదీ, అమిత్‌షాలకు శాశ్వతంగా అధికారంలో ఉండాలన్న వినాశకాల విపరీత బుద్ధితో కూడిన ఆలోచనలున్నాయన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల విషయమై తమ మిత్రపక్షాలతో త్వరలోనే మాట్లాడతామని చెప్పారు. వీలైనంత త్వరగా నామినేటెడ్‌ పదవులను భర్తీ చేస్తామన్న మహేశ్‌.. అయితే, దసరా లోపు ఉండకపోవచ్చునని సంకేతాలిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో త్వరలోనే హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.


యువ ఓటరు నమోదుపై స్పష్టతనివ్వండి:టీపీసీసీ

పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితాలో హైదరాబాద్‌ సహా రాష్ట్రానికి చెందిన ప్రధాన నగరాల్లోని ఐటీ, కార్పొరేట్‌, ఆర్థిక రంగాల్లో పని చేస్తున్న వేల మంది యువ గ్రాడ్యుయేట్ల పేర్ల నమోదు విషయమై ఎదుర్కొంటున్న సందిగ్ధతలను నివారించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ)ను టీపీసీసీ ఎన్నికల సంఘం సమన్వయ కమిటీ డిమాండ్‌ చేసింది. సీఈవోను కలిసిన టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్‌ పులిపాటి రాజేశ్‌ కుమార్‌ తదితరులు వినతిపత్రం సమర్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి

పోలవరం.. పాలమూరు వేర్వేరు ప్రాజెక్టులు కాదు!

విద్యుత్‌ ఆదా, నీటి పొదుపుపై.. ప్రజాచైతన్యానికి సినీ హీరోలు కదలాలి

కనిపించని శత్రువులతో యుద్ధం చేయాలి

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 18 , 2026 | 05:58 AM