Share News

క్యూనెట్‌ కేసు కీలక నిందితుడు డిగ్‌ విజయ్‌సింగ్‌ అరెస్టు

ABN , Publish Date - Oct 18 , 2026 | 06:12 AM

క్యూనెట్‌ ఆర్థిక మోసం కేసులో కీలక నిందితుడు డిగ్‌ విజయ్‌సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

క్యూనెట్‌ కేసు కీలక నిందితుడు  డిగ్‌ విజయ్‌సింగ్‌ అరెస్టు
DigVijay Singh

  • దుబాయ్‌కు పారిపోతుండగా ఢిల్లీలో అరెస్టు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): క్యూనెట్‌ ఆర్థిక మోసం కేసులో కీలక నిందితుడు డిగ్‌ విజయ్‌సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఢిల్లీ విమానాశ్రయంలో హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసు ప్రత్యేక బృందం విజయ్‌సింగ్‌ను అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్‌కు తీసుకొచ్చి సంబంధిత కోర్టులో హాజరుపర్చేందుకు చర్యలు చేపట్టింది. క్యూనెట్‌ విహాన్‌ డైరెక్ట్‌ సెల్లింగ్‌ పేరుతో భారీ ఆర్థిక మోసానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అధిక కమీషన్లు, తక్కువ సమయంలో భారీ రాబడులు, విదేశీ పర్యటనల వంటి ప్రలోభాలతో పలువురితో పెట్టుబడులు పెట్టించినట్లు పోలీసులు గుర్తించారు.


జూమ్‌ సమావేశాలు, సామాజిక మాధ్యమ వేదికల ద్వారా నెట్‌వర్క్‌ను విస్తరించి.. దేశవ్యాప్తంగా వేలాది మందిని మోసం చేసినట్టు తేల్చారు. మొత్తం రూ.10 వేల కోట్ల వరకు మోసం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు 43 మంది బాధితుల నుంచి వివరాలు సేకరించిన అధికారులు.. రూ.5 కోట్ల మేర లావాదేవీలను గుర్తించినట్టు తెలిసింది. విహాన్‌ డైరెక్ట్‌ సెల్లింగ్‌ ఇండియా సంస్థకు చెందిన బ్యాంకు ఖాతాలోని సుమారు రూ.4 కోట్ల నగదును ఫ్రీజ్‌ చేసినట్లు తెలిసింది. ఇక విజయ్‌సింగ్‌ నుంచి 2 మొబైల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని సమాచారం, ఆర్థిక లావాదేవీలు, ఇతర వ్యక్తులతో జరిగిన సంభాషణలను పరిశీలించడం ద్వారా.. మరికొందరి పాత్రపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

గోదావరి-కావేరీ లింకు పేరుతో కుట్ర:హరీశ్‌

కీసర మాజీ సీఐ కోటీశ్వరుడే!

రాజ్యాంగ వ్యవస్థలను నీరు గారుస్తున్న బీజేపీ

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 18 , 2026 | 06:12 AM