వారఫలాలు...ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే.?
ABN , Publish Date - Aug 09 , 2026 | 07:04 AM
ఈ వారం రాశిఫలాలు.. 9 - 15 ఆగస్టు 2026, పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
అన్ని రంగాల వారికీ కలిసి వచ్చే సమయం. మొండి బాకీలు వసూలవు తాయి. ఖర్చులు సామాన్యం. పనులు చురు కుగా సాగుతాయి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు పట్టించు కోవద్దు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అవతలివారి తాహతును క్షుణ్ణంగా తెలుసుకోండి. పత్రాల్లో సవరణలు అనుకూలి స్తాయి. పిల్లల కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు
కార్యసాధనలో సఫలీకృతులవు తారు. మీ పనితీరు స్ఫూర్తిదాయకమవుతుంది. ఖర్చులు విపరీతం. వస్త్ర, బంగారు, వెండి కొనుగోలు చేస్తారు. సంస్థల స్థాపనలకు అను కూలం. ప్రముఖులను కలుసుకుంటారు. దూరపు బంధువుల ఆహ్వానం అందుతుంది. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. మీ ఇష్టాయిష్టాలకు స్పందన లభిస్తుంది. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
సంతోషకరమైన వార్త వింటారు. మీ శ్రమ ఫలిస్తుంది. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. పనులు చురుకుగా సాగుతాయి. మీ నిర్ణయంలో మార్పు వస్తుంది. మొండిధైర్యంతో సాగుతారు. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది. వివాదాలు కొలిక్కివస్తాయి.
కర్కాటకం
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. వాహనం కొనుగోలు చేస్తారు. నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. కొత్త యత్నాలు మొదలెడతారు. పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడతాయి. కొత్తవారితో మితంగా సంభాషించండి. కొంతమంది మోసగించే ఆస్కారం ఉంది. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సన్నిహి తులను విందుకు ఆహ్వానిస్తారు.
సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలు అధికం. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమనస్కంగా గడుపుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఊహించని ఖర్చులుంటాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. నోటీసులు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి.
కన్య
ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. బంధు వుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆహ్వానం అందు కుంటారు. చిన్ననాటి పరిచయస్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం జాగ్రత.
తుల
చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
కార్యసిద్థి, వ్యవహారజయం ఉన్నాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. అయినవారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. కొంత మొత్తం పొదుపు చేస్తారు. యోగా, ధార్మికతల పట్ల ఆసక్తి పెంపొందుతుంది.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు, వాహనం అమర్చుకోవాలనే కోరిక నెరవేరుతుంది. రశీ దులు, కీలక పత్రాలు జాగ్రత్త. కొత్తయత్నాలు చేపడతారు. అంచనాలు ఫలిస్తాయి. సావకా శంగా పనులు పూర్తిచేస్తారు. చీటికి మాటికి చికాకుపడతారు. మాటతీరు అదుపులో ఉంచు కోండి. గృహమరమ్మతులు చేపడతారు. పక్క వారి నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
అన్నివిధాలా అనుకూలం. మాట నిలబెట్టుకుంటారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. కొన్ని పనులు ఆకస్మి కంగా పూర్తవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడ తాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. అందరితోనూ మితంగా మాట్ల్లాడండి. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. అతిగా శ్రమించవద్దు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
ప్రతికూలతలను అధిగ మిస్తారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. లక్ష్యం సాధిస్తారు. మొండిబాకీలు అతికష్టంమ్మీద వసూలవు తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. ఆప్తుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందుకోండి. అనుమానాలకు తావివ్వవద్దు. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. పనులు సాగుతాయి. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. వ్యవ హార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. సన్నిహి తుల వ్యాఖ్యలు మీపై తీవ్రంగా పనిచేస్తాయి. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు.
మీనం
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
సంప్రదింపులు ముందుకు సాగవు. ఆలోచనలతో సతమతమవుతారు. లావాదేవీల్ల్లో ఏకాగ్రత వహించండి. తొందర పాటు నిర్ణయాలు తగవు. ఖర్చులు విపరీతం. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆత్మీయు లతో తరచూ సంభాషిస్తుంటారు. ఒక ఆహ్వా నం సందిగ్థానికి గురిచేస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పిల్లలకు శుభపరిణామాలున్నాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రశ్నించడమే కాదు.. పరిష్కారాలు వెతకండి
రొమ్ము క్యాన్సర్ పరీక్షకు మహిళలు దూరం
Read Latest AP News And Telangana News And International News And Telugu News