ఇండక్షన్ స్టవ్‌లకు వడ్డీ లేని రుణాలు!
ABN , Publish Date - Aug 09 , 2026 | 06:06 AM
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో వంట గ్యాస్ కొరతను అధిగమించేందుకు ఇండక్షన్ స్టవ్‌ల వాడకాన్ని ప్రోత్సహించాలని..
న్యూఢిల్లీ, ఆగస్టు 8: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో వంట గ్యాస్ కొరతను అధిగమించేందుకు ఇండక్షన్ స్టవ్‌ల వాడకాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకనుగుణంగా ఇండక్షన్ స్టవ్‌ల కొనుగోలుపై వడ్డీ లేని రుణాలు అందించాలని యోచిస్తోంది. ఇరాన్, అమెరికా యుద్ధం నేపథ్యంలో తలెత్తిన ఇంధన సంక్షోభంతో వంట గ్యాస్ సరఫరాకు ఇబ్బందులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలను గ్యాస్ పొయ్యిల వాడకం నుంచి ఇండక్షన్ స్టవ్‌ల వైపు మళ్లించాలన్నది కేంద్రం యోచన. ఇందుకోసం ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎనర్జి ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎ్‌సఎల్) ద్వారా వడ్డీ లేని రుణాలు అందించాలని భావిస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. వీటికోసం ఈఎంఐ విధానాన్ని కూడా అమలు చేయాలని కేంద్ర భావిస్తున్నట్లు తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఆగ్రాలో రహదారిపై భారీ గుంత.. అందరూ చూస్తుండగానే..
డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ