Share News

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే?

ABN , Publish Date - Aug 23 , 2026 | 06:50 AM

23 - 29 ఆగస్టు 2026 (పి.ప్రసూనా రామన్‌)

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే?
Weekly Horoscope

మేషం

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

mesham.jpgనిర్విరామంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. చాకచక్యంగా అడుగు లేస్తారు. రావలసిన ధనం అందుతుంది. రుణ విముక్తులవుతారు. పనులు, కార్యక్రమాలు చురుకుగా సాగుతాయి. అప్రమత్తంగా ఉండాలి. మితంగా సంభాషించండి. ఆత్మీయు లతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. దళారు లను ఆశ్రయించవద్దు. ఆరోగ్యం సంతృప్తికరం. శుభకార్యంలో అందరినీ ఆకట్టుకుంటారు.


వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు

vrushabham.jpgగ్రహస్థితి బాగుంది. పరిస్థితులు చక్కబడతాయి. అనుకున్నది సాధిస్తారు. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆప్తులకు ధనసహాయం చేస్తారు. పనులు అనుకున్న విధంగా సాగుతాయి. ప్రముఖు లను ఆకట్టుకుంటారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది.


మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు

mithunam.jpgస్థిరాస్తి ధనం అందుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కివస్తాయి. ఖర్చులు విపరీతం. పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ప్రముఖులను ఆకట్టుకుంటారు. సభ్యత్వ స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఫోన్‌ సందేశాలు పట్టించుకోవద్దు. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు.


కర్కాటకం

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

karkatakam.jpgవ్యవహారాలతో తీరిక ఉండదు. పనిభారం, అకాలభోజనం. రావలసిన ధనం అందుతుంది. కొంత మొత్తం పొదుపు చేస్తారు. పనులు అనుకున్న విధంగా సాగు తాయి. కీలకపత్రాలు, అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్థంలో జాగ్రత్త. తాహతుకు మించి హామీలివ్వద్దు. అందరితోనూ మితంగా సంభాషించండి.


సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

simham.jpgకొంతమేరకు అనుకూలం. పరిస్థితుల్లో మార్పువస్తుంది. రుణవిముక్తుల వుతారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుం టాయి. ఆహ్వానం అందుకుంటారు. పరిచ యాలు బలపడతాయి. వ్యూహాత్మకంగా అడు గులేస్తారు. మీ ఊహలు ఫలించకపోవచ్చు. వివాదాస్పద విషయాల జోలికి పోవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి.


కన్య

ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు

kanya.jpgప్రతికూలతలు అధికం. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. అనవసర జోక్యం తగదు. ఖర్చులు అదుపులో ఉండవు. రాబడిపై దృష్టిసారిస్తారు. పనులు హడా వుడిగా సాగుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలు చేపడతారు. ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. ముఖ్యులను కలుసుకుంటారు. మొండి ధైర్యంతో ముందుకు సాగుతారు.


తుల

చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

tula.jpgమీదైన రంగంలో నిలదొక్కు కుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. సంస్థల స్థాపనకు అను కూలం. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. స్థిమితంగా పనులు పూర్తిచేస్తారు. వ్యవహా రాల్లో మెలకువ వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. కొత్తయత్నాలు చేపడతారు.


వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

vruchikam.jpgకార్యసిద్థి, వస్త్రప్రాప్తి ఉన్నాయి. మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఆదాయం బాగుంటుంది. వాహనం కొనుగోలు చేస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఆప్తుల ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. మీ మాటే నెగ్గాలన్న పంతానికి పోవద్దు. ఎదుటివారి అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వండి. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు.


ధనుస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

dhanussu.jpgసర్వత్రా అనుకూలం. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. అవకా శాలు కలిసివస్తాయి. రావలసిన ధనం అందు తుంది. రుణవిముక్తులవుతారు. ఖర్చులు అధి కం. పనులు చురుకుగా సాగుతాయి. ఇతరు లను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఆరోగ్యం మందగిస్తుంది. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.


మకరం

ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

makaram.jpgఆదాయం నిరాశాజనకం. పెద్దఖర్చు తగులుతుంది. రుణాలు స్వీకరి స్తారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ సాధ్యపడదు. కార్య క్రమాలు వాయిదా వేసుకుంటారు. పత్రాల్లో సవరణలు అనివార్యం. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. ఆప్తులను విందుకు ఆహ్వానిస్తారు. నోటీసులు అందుతాయి. నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు.


కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

kumbham.jpgలావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. అనుభవజ్ఞులను సంప్రదిం చండి. మీ నిర్ణయం వాయిదా వేయటం శ్రేయస్కరం. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రతి చిన్న విషయానికీ అస హనం చెందుతారు. ప్రశాంతంగా ఉండ టానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించు కోవటం శ్రేయస్కరం. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు.


మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

meemam.jpgనిర్విరామంగా శ్రమిస్తారు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచికే. మీ కష్టం త్వరలో ఫలిస్తుంది. ఓర్పుతో మెలగండి. సాయం ఆశించవద్దు. మీ సమర్థతపై నమ్మ కం పెంచుకోండి. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహి స్తారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ఆహ్వానం అందుకుంటారు. ఉల్లాసంగా గడుపు తారు. పందాలు, బెట్టింగ్‌ల జోలికిపోవద్దు.


ఈ వార్తలు కూడా చదవండి:

రేవంత్‌ తేల్చుకోవాలి!

ఆదమరిస్తే అన్నీ కష్టాలే

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 23 , 2026 | 06:58 AM