Share News

సెప్టెంబరు 1 నుంచి బోర్డింగ్‌ పాస్‌పై స్టాంప్‌ వేయరు

ABN , Publish Date - Aug 23 , 2026 | 06:06 AM

విమాన ప్రయాణికుల సౌకర్యార్థం బ్యూరో ఆఫ్‌ ఇమ్మిగ్రేషన్‌ (బీవోఐ) ఓ కీలక మార్పును అమల్లోకి తీసుకొస్తోంది. విదేశాలకు వెళ్లే ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్లలో...

సెప్టెంబరు 1 నుంచి బోర్డింగ్‌ పాస్‌పై స్టాంప్‌ వేయరు

న్యూఢిల్లీ, ఆగస్ట్‌ 22: విమాన ప్రయాణికుల సౌకర్యార్థం బ్యూరో ఆఫ్‌ ఇమ్మిగ్రేషన్‌ (బీవోఐ) ఓ కీలక మార్పును అమల్లోకి తీసుకొస్తోంది. విదేశాలకు వెళ్లే ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్లలో ఈ-బోర్డింగ్‌ పాస్‌ చూపించి, వేగంగా ఇమ్మిగ్రేషన్‌ అనుమతి(క్లియరెన్స్‌) పొందొచ్చు. అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్‌ కౌంటర్ల వద్ద ఇకపై పేపర్‌ బోర్డింగ్‌ పాస్‌ చూపించడం, దానిపై స్టాంప్‌ వేసే విధానాన్ని నిలిపివేయనున్నారు. స్టాంప్‌ కారణంగా బోర్డింగ్‌ పాస్‌పై అక్షరాలు సరిగ్గా కనిపించకపోవడం, అదే సమయంలో ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యాన్ని పరిగణనలోకి తీసుకుని బీవోఐ ఈ నిర్ణయానికి వచ్చింది. సెప్టెంబర్‌ 1 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. అయితే, ఆ తర్వాత కూడా పేపర్‌ రూపంలోని బోర్డింగ్‌ పాస్‌లను అనుమతిస్తారని, వాటిపై స్టాంపింగ్‌ మాత్రం వేయబోరని బీవోఐ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

ఆ అవమానకర వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ

డీఎస్సీపై జగన్‌కు మరోసారి సవాల్ విసిరిన మంత్రి లోకేశ్

Updated Date - Aug 23 , 2026 | 06:06 AM