రేప్ కేసు తొక్కిపెట్టేందుకు 5 కోట్లు డిమాండ్
ABN , Publish Date - Aug 23 , 2026 | 06:04 AM
పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్ మాన్ భార్యపై అవినీతి ఆరోపణలు రావడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. రేప్ కేసును తొక్కిపెట్టేందుకు సీఎం సతీమణి గురుప్రీత్ కౌర్...
పంజాబ్ సీఎం భార్యపై హైకోర్టు మాజీ జడ్జి ఆరోపణ
న్యూఢిల్లీ, చండీగఢ్, ఆగస్టు 22: పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్ మాన్ భార్యపై అవినీతి ఆరోపణలు రావడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. రేప్ కేసును తొక్కిపెట్టేందుకు సీఎం సతీమణి గురుప్రీత్ కౌర్ రూ.5 కోట్లు లంచంగా డిమాండు చేశారని పంజాబ్-హరియాణా హైకోర్టు మాజీ జడ్జి ఒకరు ఆరోపించారు. దీనిపై అందిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ దర్యాప్తు జరిపి 2వారాల్లో నివేదిక సమర్పించాలని శుక్రవారం పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని ఆదేశించినట్టు శనివారం అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు 24 గంటల్లోగా సమాధానం చెప్పాలని సంబంధిత మాజీ జడ్జికి గురుప్రీత్ కౌర్ శనివారం లీగల్ నోటీసు పంపించారు. దీనిపై రాజకీయ పార్టీలు స్పందించాయి. ఆరోపణల తీవ్రత దృష్ట్యా ముఖ్యమంత్రే స్వయంగా వివరణ ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ డిమాండు చేశారు.
ఇవి కూడా చదవండి
ఆ అవమానకర వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ
డీఎస్సీపై జగన్‌కు మరోసారి సవాల్ విసిరిన మంత్రి లోకేశ్