ఈవారం రాశి ఫలాలు.. ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - May 10 , 2026 | 07:59 AM
వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకోండి. 10 - 16 మే 2026 పి.ప్రసూనా రామన్
వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకోండి. 10 - 16 మే 2026 పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
పరిస్థితులు చక్కబడతాయి. నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కష్టం వృథా కాదు. లక్ష్యం నెరవేరుతుంది. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. సన్నిహితుల సలహా పాటించండి. వివాహయత్నం ఫలిస్తుంది. మీ ఇష్టాయిష్టాలను పెద్దల ద్వారా తెలియజేయండి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు
కార్యసాధనకు ఓర్పుతో శ్రమించండి. ఒత్తిడికి గురికావద్దు. యత్నాలను సన్నిహితులు ప్రోత్సహిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. అవగాహన లేనివిషయాల్లో జోక్యం తగదు. అకారణంగా మాటపడవలసి వస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ఆప్తులతో తరచూ సంభాషిస్తుంటారు. నోటీసులు అందుతాయి. పిల్లల ఉన్నత చదువులపై దృష్టిపెడతారు.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
లావాదేవీలు సంతృప్తినిస్తాయి, రావలసిన ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. పెట్టుబడులు కలిసివస్తాయి. కొందరి రాక చికాకు కలిగిస్తుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. కావలసిన వస్తువులు సమయానికి కనిపిం చవు. చిన్న విషయానికే చికాకుపడతారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి.
కర్కాటకం
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారాలతో సతమతమవు తారు. విశ్రాంతి లోపం, అకాలభోజనం. ప్రలోభాలకు లొంగవద్దు. కొంతమొత్తం ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఆప్తులను కలుసుకుంటారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. పిల్లలు మంచి ర్యాంకు సాధిస్తారు. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు.
సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అన్ని రంగాల వారికీ యోగ దాయకమే. ప్రతికూలతలను అధిగమిస్తారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. మీ నిర్ణయం ఇరువర్గాలకూ ఆమోదయోగ్యమవుతుంది. అనుకున్న ఖర్చులే ఉంటాయి. కొంత మొత్తం పొదుపు చేయగల్గుతారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. అనవ సర విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది.
కన్య
ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. శ్రమించినా ఫలితం ఉండదు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయ మనంతో మెలగండి. యత్నాలు విరమించు కోవద్దు. పరిస్థితులు నిదానంగా చక్కబడ తాయి. ఖర్చులు విపరీతం. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. మొక్కుబడిగా పనులు పూర్తిచేస్తారు. ఓర్పుతో ముందుకు సాగుతారు.
తుల
చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. ఒప్పందాల్లో సరైన నిర్ణయం తీసుకుంటారు. రుణసమస్య పరిష్కారమవుతుంది. ఖర్చులు సామాన్యం. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. వివాహయత్నం ఫలిస్తుంది. తాహతుకుమించి హామీలివ్వవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సామరస్యంగా మెలగండి. ఆప్తులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. ధైర్యంగా ముందుకు సాగుతారు. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఊహించని సంఘటన ఎదురవుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు విపరీతం. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. కొందరి రాక చికాకు కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు సాగవు. చిన్న విషయానికే చికాకుపడతారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. విదేశీ సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. పనులు త్వరితగతిన సాగుతాయి. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాప్యం తగదు. అందరితోనూ మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. కొత్త యత్నాలు చేపడతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
రావలసిన ధనం అందుతుంది. ఇబ్బందులు తొలగుతాయి. మాట నిలబెట్టు కుంటారు. స్నేహసంబంధాలు బలపడతాయి. కొత్త పనులు చేపడతారు. వ్యాపకాలు అధిక మవుతాయి. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుం టుంది. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. పత్రాల్లో మార్పుచేర్పులు అనివార్యం. అప్రమత్తంగా ఉండాల్సిన తరుణం. శుభకార్యానికి హాజరవుతారు.
మీనం
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
గ్రహాల సంచారం బాగుంది. చిత్తశుద్ధిని చాటుకుంటారు. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. స్థిరాస్తి ధనం అందుతుంది. పొదుపు పథకాల పట్ల ఆకర్షి తులవుతారు. ప్రైవేట్ ఫైనాన్సులలో మదుపు తగదు. మీ ఇబ్బందులను సున్నితంగా తెలియజేయండి. కుటుంబసౌఖ్యం పొందుతారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఆప్తులతో తరచూ సంభాషిస్తారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
ఈ వార్తలు కూడా చదవండి:
ఎలుకల నుంచి మనుషులకు హంటా వైరస్..
Read Latest Telangana News and National News