Share News

బాలికపై లైంగిక దాడి ఘటన.. సుమోటోగా కేసు

ABN , Publish Date - May 10 , 2026 | 06:39 AM

ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కాళ్లచెరువు గ్రామంలో బాలికపై చర్చి పాస్టర్‌ లైంగిక దాడికి పాల్పడిన ఘటనను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ తీవ్రంగా పరిగణించింది.

బాలికపై లైంగిక దాడి ఘటన.. సుమోటోగా కేసు

  • రంగంలోకి బాలల హక్కుల కమిషన్‌

అమరావతి, మే 9 (ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కాళ్లచెరువు గ్రామంలో బాలికపై చర్చి పాస్టర్‌ లైంగిక దాడికి పాల్పడిన ఘటనను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ తీవ్రంగా పరిగణించింది. నిందితుడు చౌటపల్లి రాంబాబు(42)పై సుమోటోగా కేసు నమోదు చేసినట్లు కమిషన్‌ చైర్మన్‌ వేటుకూరి సూర్యనారాయణరాజు తెలిపారు. సోమవారం కళ్లచెరువు గ్రామానికి వెళ్లి బాధిత బాలికను, ఆమె కుటుంబాన్ని పరామర్శించనున్నట్లు ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలిక ఆరోగ్య పరిస్థితి, పోలీసుల కేసు దర్యాప్తు పురోగతిపై సమగ్ర నివేదికను తీసుకోనున్నట్లు తెలిపారు.

Updated Date - May 10 , 2026 | 06:40 AM