వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
ABN , Publish Date - Aug 12 , 2026 | 07:00 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.

ఆదివారం హుండీ ఆదాయం: రూ.5.36 కోట్లు
సోమవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 81,064
తలనీలాలు సమర్పించినవారు: 33,136
ఈ వార్తలు కూడా చదవండి:
10.7 శాతం వృద్ధి.. 2025-26 రెండో త్రైమాసికంలో నమోదు..
Read Latest AP News And Telangana News And International News And Telugu News