‘సర్’తో భారీగా ఓట్ల కోత..
ABN , Publish Date - Aug 12 , 2026 | 12:59 AM
ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ ముగిసిపోయింది. ఇందులో వివిధ రకాల ఓటర్ల వివరాలు వెళ్లడయ్యాయి.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ ముగిసిపోయింది. ఇందులో వివిధ రకాల ఓటర్ల వివరాలు వెళ్లడయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ శాసనసభ నియోజకవర్గాల్లో నిర్ణీత గడువులోనే ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియ 87.69 పూర్తి చేశారు. మృతులు, డబుల్ ఓటర్లు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, దొరకని ఓటర్ల సంఖ్యలను వెల్లడించారు. సర్ ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధులు భారీగా ఓట్లు తొలగిపోతాయని ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. తమ పార్టీల ప్రతినిధులను అప్రమత్తం చేసి ఓటర్లు తొలగిపోకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం తేలిన లెక్క ప్రకారం రెండు నియోజకవర్గాల్లో 475694 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. డిజిటలైజేషన్‌లో 417127 మంది ఓటర్ల ఓటు హక్కు కలిగి ఉన్నారు. 58 వేల 567 మంది ఓట్లు తొలగిపోనున్నాయి. ఇందులో 12 వేల 791 ఓటర్లు మృతుల జాబితాలో ఉన్నారు. శాశ్వతంగా వెళ్లిపోయిన వారు 25 వేల 926 మంది. డబుల్ ఓటర్లు 10 వేల 62 మంది, ఆచూకీ దొరకని ఓటర్లు 9098 మంది ఉన్నారు. ఇతరుల జాబితాలో 690 మంది ఉన్నారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కోసం సోమవారం అర్ధరాత్రి వరకు లక్ష్యసాధనకు యంత్రాంగం పనిచేసి మంగళవారం వివరాలు వెల్లడించారు. మృతుల ఓటర్లు, బోగస్ ఓటర్ల తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సిరిసిల్ల వేములవాడ రెండు సెగ్మెంట్లలో 58567 ఓట్లు తొలగిపోవడంతో రాజకీయ పార్టీలో అలజడి మొదలైంది. ఈనెల 17న వెల్లడయ్యే ముసాయిదా ఓటర్ జాబితాలో తొలగించిన ఓటర్లలో ఎవరు ఉన్నారనేది తేలిపోతుంది. తొలగించిన ఓటర్లలో మద్దతుధారులు, సానుభూతిపరులు ఎంతమంది ఉన్నారనే దానిపై కూడా రాజకీయ పార్టీలకు స్పష్టత వస్తుంది. జిల్లాలో ఉపాధి, వ్యాపారాలు, ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు కొందరు తమ ఓటు హక్కును సొంత ఊర్లోనే ఉండే విధంగా చూసుకున్నారు. ఎక్కువమంది హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో స్థిరపడంతో అక్కడే నమోదు చేసుకున్నారు. మృతులు, డూప్లికేట్, వలస ఓటర్లు, అనామాలిస్ ఓటర్లకు నోటీసులు ఇవ్వనున్నారు.
సిరిసిల్ల సెగ్మెంట్లో 12.88 శాతం ఓటర్ల తొలగింపు..
జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గంలో ‘సర్’ ప్రక్రియ 87.12 శాతం పూర్తి చేశారు. ఇందులో ఓట్ల తొలగింపులో 12.88 శాతం ఉంది. నియోజకవర్గంలో 2 లక్షల 46 వేల 562 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా, 2 లక్షల 14 వేల 804 మంది ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తి చేశారు. ఓటర్లలో మృతులు 6032 మంది ఉన్నారు. శాశ్వతంగా వెళ్లిపోయిన వారు 15452 మంది. డబుల్ ఓటర్లు 5017మంది, దొరకని ఓటర్లు 4997 మంది ఉన్నారు. ఇతరుల జాబితాలో 260 మంది ఓటర్లను చేర్చారు.
వేములవాడ సెగ్మెంట్లో 11.70 శాతం ఓటర్ల తొలగింపు
వేములవాడ నియోజకవర్గంలో 88.30 శాతం పూర్తి చేశారు. ఇందులో ఓట్ల తొలగింపులో 11.70 శాతం ఉంది. నియోజకవర్గంలో 2లక్షల 29 వేల 132 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా 2 లక్షల 2323 మంది ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తి చేశారు. ఓటర్లలో మృతులు 6759 మంది ఉన్నారు. శాశ్వతంగా వెళ్లిపోయిన వారు 10474 మంది, డబుల్ ఓటర్లు 5045 మంది, దొరకని ఓటర్లు 4101 మంది ఉన్నారు. ఇతరుల జాబితాలో 430 మంది ఓటర్లను చేర్చారు.
సిరిసిల్ల సెగ్మెంట్‌లో ఓటర్లు, తొలగింపు వివరాలు
మండలం ఫారాల పంపిణీ డిజిటలైజేషన్ తొలిగిన ఓట్లు మృతులు శాశ్వతంగావెళ్లిన డబుల్ ఓటర్లు అడ్రస్ దొరకని వారు
వీర్నపల్లి 11606 10663 943 150 590 191 10
ఎల్లారెడ్డిపేట 40195 35593 4602 998 1797 780 1002
గంభీరావుపేట 36737 33977 2760 669 959 757 271
సిరిసిల్ల 80541 66085 14456 2869 8153 1908 1462
తంగళ్ళపల్లి 39569 34108 5461 759 2343 617 1680
ముస్తాబాద్ 37914 34378 3536 587 1610 764 572
మొత్తం 246562 214804 31758 6032 15452 5017 4997
వేములవాడ సెగ్మెంట్ లో ఓటర్లు, తొలగింపు వివరాలు
మండలం ఫారాల పంపిణీ డిజిటలైజేషన్ తొలిగిన ఓట్లు మృతులు శాశ్వతంగావెళ్లిన డబుల్ ఓటర్లు అడ్రస్ దొరకని వారు
మేడిపల్లి 24535 22160 2375 726 1066 481 101
భీమారం 17744 15931 1813 615 694 405 88
కథలాపూర్ 38184 33465 4719 1771 1494 1369 85
రుద్రంగి 8699 7421 1278 236 521 476 45
చందుర్తి 28257 24717 3540 1005 1638 606 28
వేములవాడ రూరల్ 18998 17410 1588 520 729 312 26
వేములవాడ 58143 48537 9606 1516 3252 1064 88
కోనరావుపేట 34572 32682 1890 370 1080 332 42
మొత్తం 229132 202323 26809 6759 10474 5042 430